భారతీయ ప్రాచీన అణువిజ్ఞానం

By telugu news team  |  First Published Apr 23, 2020, 12:14 PM IST

ప్రపంచంలో ప్రతీది పరమాణునిర్మితమే. పరమాణువు లేనిదే ఈ సృష్టి లేదు. ఈ సృష్టికి, పరమాణువుల మధ్య సంబంధం మరియు ఈ విశ్వసృష్టి రహస్యలను తెలుసుకొనుటకు త్రికరణశుద్ధిగా ఎంతోమంది ప్రయత్నించారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నవి రెండు అవి ఒకటి శక్తి , రెండవది పదార్ధం. ముందు ఇక్కడ మీకు పదార్థం గురించి వివరణ ఇస్తాను. ఈ పదార్ధాలలో రెండు రకాలు కలవు. అందులో ఒకటి జీవపదార్ధం , రెండోవది జడ పదార్ధం. ఈ రెండు రకాలు అంతా  పరమాణుమయంగా ఉంటాయి. ఒక పదార్దాన్ని చాలా చిన్నగా విభజించుకుంటూ పోతే చివరికి అది కంటికి కనిపించనంత సూక్ష్మరేణువుగా మిగులును. ఇలాంటి కొన్ని కోట్ల పరమాణువులు ఒక దగ్గర కూడటం వలన పదార్థం ఏర్పడును. 

ప్రపంచంలో ప్రతీది పరమాణునిర్మితమే. పరమాణువు లేనిదే ఈ సృష్టి లేదు. ఈ సృష్టికి, పరమాణువుల మధ్య సంబంధం మరియు ఈ విశ్వసృష్టి రహస్యలను తెలుసుకొనుటకు త్రికరణశుద్ధిగా ఎంతోమంది ప్రయత్నించారు. అటువంటివారిలో అతి ముఖ్యుడు కణాదుడు. అణు విజ్ఞానాన్ని ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా గ్రంథస్థం చేసిన మహావిజ్ఞాని  "కణాద మహార్షి " ఈయన అసలు పేరు "కాశ్యపుడు" కణాల గురించి వివరించటం మూలాన కణాదుడు అని పేరువచ్చింది. 

అణువులు, పరమాణువులు గురించి "వైశేషిక సూత్రం " అనే గ్రంథాన్నిఈయన రాశాడు. వైశేషిక సూత్ర గ్రంథంలో ఆయన చేసిన ప్రతి పాదనలు సమగ్రవంతంగా ఇప్పటికీ ఆమోదయోగ్యముగా ఉన్నాయి. పదార్ధాన్ని విడగొడితే అణువులు, అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడుతాయని కణాదుడు స్పష్టంగా చెప్పాడు . విభిన్నమైన పరమాణువుల ఎన్నో ఉన్నాయని వాటి విలక్షణమైన కలయిక వల్లనే భూమ్యాకాశాలు, అగ్ని, గాలి, నీరు మొదలైనవన్నీ రూపొందాయి అని వివరించాడు. 

పదార్ధాలు పరమాణువు స్థాయికి వచ్చినపుడు ఆ పరమాణువులు తమ విశిష్ట లక్షణాలతో అలరారుతాయని చెప్పాడు. పదార్ధాలుగా రూపొందేప్పుడు రకరకాల పరమాణువులు కలియడం వలన వాటికి ప్రత్యేకమైన ధర్మాలు ప్రాప్తిస్తాయని సత్యాన్ని ఈ శాస్త్రవేత్త ఆనాడే ప్రకటించడం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది .

కణాద మహర్షి వివరణ ప్రకారం రెండు పరమాణువులు కలిస్తే " ద్వణుకం " మూడు పరమాణువులు కలిస్తే "త్రణుకం" అవుతుందని ఈయన వివరించి చెప్పాడు. పదార్ధములను మూలమైన పరమాణువులు, సృష్టి నిర్మాణంలో ఆధారం అయినందున అవి నిత్యములై ఉంటాయని వాటికి నాశనం లేదని చెప్పాడు .
 

click me!