
జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణీకులు ఎందరో కానీ ఏదీ మనకు శాశ్వతం కాదు ఎవరూ శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నీవ్వే ఓడేది కూడా నీవ్వే గెలుపుకు పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా కోరేవారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం అదే నీ కర్తవ్యం నీకు కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు కానీ మనిషితో కాదు! నీకు ఏమైన సమస్య వచ్చినప్పుడు నీవు కాలంతో పోరాడు కానీ నీ కన్నీరుతో కాదు.
మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏది ఆలోచిస్తున్నాం అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకు వచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతులోనే ఉంది .
ఎదుటి వారిని కలుపుకు పోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు అంతా నాకే తెలుసు నాకెవరి అవసరం లేదనే అహం మనకుంటే సమాజమే మనని దూరం పెడుతుంది మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు మనము ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం .
ఏమైన గొడవ జరిగితే కాని బయట పడవు అస్సలు ఎవరి మనసులో ఎముందో చూడటానికి, ఏముంది అందరు నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయట పడతాయి.
డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151