దేవాలయాన్ని సందర్శించడానికి ఈ పద్దతి పాటించాల్సిందే..

By telugu news teamFirst Published Feb 26, 2020, 12:01 PM IST
Highlights

సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి - ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి వెళ్ళాలి. 

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమ పవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం, అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి - ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి వెళ్ళాలి. 

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” … ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ పరధ్యాస చేయకుండా, ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ నిధానంగా గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు    నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ నమస్కరించుకోవాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలో పెట్టి  చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పరుష పదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం లాంటివి చేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

19) మాడ్రన్ ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి ఆ తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో నమస్కారం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్క కూడదు.

27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంత వరకు నిదానం ఉండాలి.

33) గోపుర దర్శనం తప్పక చేయాలి.

34) ఆలయంలోని మర్రి చెట్టుకు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

click me!