శ్రావణ అమావాస్య.. ఆ దోషంతో బాధపడుతున్నారికి విముక్తి..!

Published : Aug 07, 2021, 01:39 PM ISTUpdated : Aug 07, 2021, 01:54 PM IST
శ్రావణ అమావాస్య..  ఆ దోషంతో బాధపడుతున్నారికి విముక్తి..!

సారాంశం

ఈ అమావాస్య రోజున పితృపూజ జరిపిస్తే.. చాలా మంచి జరుగుతుందట. అంతేకాదు.. మంచి వర్షాలు పండాలని.. రైతులకు మంచి పంట పండాలని కూడా.. ఈ రోజున దేవుళ్లకు పూజలు చేస్తుంటారట.

జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది.  ఈ నెలలోనే ఎక్కువ శుభకార్యాలు కూడా జరుగుతుంటాయి. ఈ సంగతి పక్కన పెడితే..  ఈ ఆదివారం అంటే.. ఆగస్టు 8వ తేదీన అమావాస్య వస్తోంది. ఈ అమావాస్య ఎంతో విశిష్టత కలిగి ఉందని పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ అమావాస్య నే హరియాలి అమాస్య అని కూడా పిలుస్తారు.

ఈ అమావాస్య రోజున పితృపూజ జరిపిస్తే.. చాలా మంచి జరుగుతుందట. అంతేకాదు.. మంచి వర్షాలు పండాలని.. రైతులకు మంచి పంట పండాలని కూడా.. ఈ రోజున దేవుళ్లకు పూజలు చేస్తుంటారట.

ఈ అమావాస్య ఆదివారం ఆగస్టు8వ తేదీన వస్తోంది. ఆగస్టు7వ తేదీ రాత్రి 7గంటల 11 నిమిషాలకు ప్రారంభమై..  ఆగస్టు8వ తేదీ రాత్రి7గంటల 19 నిమిషాలకు ముగియనుంది.

ఈ అమావాస్య ప్రత్యేకత..

ఈ అమావాస్యకు విశిష్టత ఎక్కువగా ఉందని జోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి... ఎలాంటి దోషాలు ఉన్నా.. ఈ రోజు పూజ చేస్తే తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా కాల సర్ప దోషం ఉన్నవారు.. పూజ చేస్తే.. ఆ దోషం తొలగిపోయి.. వారికి అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!