నాగ పంచమి రోజు ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి..!

By telugu news team  |  First Published Aug 8, 2023, 11:07 AM IST

తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.


సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.

కాగా, ఈ ఏడాది నాగ పంచమిని ఆగస్టు 21వ తేదీన భక్తులు జరుపుకోనున్నారు. ఈ నాగ పంచమి రోజున భక్తులు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నాగేంద్రుడి ఆశీర్వాదం లభిస్తుందని అందరూ నమ్ముతుంటారు. నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. 

Latest Videos

అంతేకాకుండా, నాగ పంచమి రోజున ‘విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. అలా చేయడం వల్ల  నాగ పంచమి రోజున పూజచేసిన వారికి విష బాధలుండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజూ నాగ పంచమి రోజున చదివినవారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు. వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్ప దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయి. సంతానం లేక బాధ పడుతున్న వారికి ఆ సమస్య తీరుతుంది. వారు కోరుకున్న కోరికలు కూడా తీరతాయి అని నమ్ముతుంటారు.

click me!