తేదీ 3 నవంబర్ 2021 శ్రీ ప్లవ నామ సంవత్సర, ఆశ్వీయుజ బహుళ చతుర్ధశి, బుధవారం రోజు "నరక చతుర్ధశి" పండగ ఈ రోజు మంగళ స్నానాలు ఆచరించి ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు గురు హోరలో హారతులు తీసుకోవాలి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
దీపం జ్యోతి: పరబ్రహ్మ
దీపం సర్వతమో పహమ్,
దీపతే సాధ్యతే సర్వం
సంధ్యాదీప నమోsస్తుతే.
undefined
నరక చతుర్ధశి హారతులు :- తేదీ 3 నవంబర్ 2021 శ్రీ ప్లవ నామ సంవత్సర, ఆశ్వీయుజ బహుళ చతుర్ధశి, బుధవారం రోజు "నరక చతుర్ధశి" పండగ ఈ రోజు మంగళ స్నానాలు ఆచరించి ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు గురు హోరలో హారతులు తీసుకోవాలి.
తేదీ 4 నవంబర్ 2021 గురువారం రోజు హారతులు తీసుకోవాలనుకునేవారు..
సూర్యోదయానకి పూర్వం 4 గంటల నుండి ఉదయం 5: 50 నిమిషాలలోపు హారతులు తీసుకోవాలి. ( సూర్యోదయానికి ముందే హారతులు తీసుకోవాలి )
దీపావళి లక్ష్మీ పూజలు జరుపుకునే ముహూర్తాలు :-
* ఉదయం 8 గంటల నుండి 9:56 లలోపు
* ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు
* సాయంత్రం 3:18 నిమిషాల నుండి రాత్రి 10:30 నిమిషాల వరకు శ్రీ ధనలక్ష్మి అమ్మవారి దీపావళి విశేష పూజలు నిర్వహించుకొనుటకు అనుకూలమైన ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
* కొత్తగా నోములు పట్టుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలం.
ఈ సంవత్సరం స్వాతి కార్తె, స్వాతి నక్షత్రం, అమావాస్య తిధి అన్నీ అనుకూలంగా కలిసి ఉన్నందున కొత్తగా శ్రీ కేదారీశ్వరస్వామి వ్రతం తీసుకోవాలని అనుకునే వారికి .. ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నందున నోములు స్వీకరించవచ్చును.
* పడిపోయిన నోములు:- గతంలో ఏవైనా అవంతరాల వలన నోములు పడిపోయినవారికీ కూడా ఈ సంవత్సరం పున:ప్రారంభించుకోవచ్చును.
* నూతనంగా వివాహమైన దంపతులు మరియు గతంలో వివాహమైన వారికి ఇన్నాళ్ళూ దీపావళి హారతులు కలిసిరాని వాళ్ళకు, ఈ సంవత్సరం అందరికీ హారతులు తీసుకొనుటకు అనుకూలంగా ఉంది.
ముఖ్య గమనిక :- ఈ దీపావళి పండగ అనేది మనకు మనమే కుటుంబ, బంధుపరివారంతో జరుపుకోవడంలో ఘనత ఏముంటుంది.. ? మన చుట్టుప్రక్కలలో ఉన్న పేదవారికి తోచిన సహాయ సహకారాలు అందిద్దాం. వారికి ( కొత్తబట్టలు , తీపి పదార్ధాలు, టపాకాయలు ) కొనిద్దాం. విధివశాత్తు పేదరికం అనుభవిస్తున్న పెదకుటుంబాలను ఆదుకుందాం, మనం చేసే చిరు సహయం వలన పండగ రోజు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మనం చేసిన సహాయం వలన వారి ముఖం కళ్ళలో కాంతులు కన్పిస్తాయి.. అదే మనకు నిజమైన దీపావళి పండగ . నిజానికి పండగ రోజు ఎవరైతే పేదవారి కుటుంబంలో ఆనందానికి కారకులు అవుతారో వారికి తప్పకుండా దైవానుగ్రహం కలిగి .. చెలిమెలో నీరు ఊరినట్లుగా అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. సర్వేజనా: సుఖినోభవంతు .. జై శ్రీమన్నారాయణ.