ఈ ఆయణంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయణం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది..
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత వుంది. ఇక ఈ ఏడాది ఆషాడం జూలై 10 న మొదలై ఆగస్టు 8 వ తేదీ వరకూ ఉంటుంది. పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడమాసం. ఇది తెలుగు సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల.. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తై సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు, దాంతో దక్షిణాయణం మొదలవుతుంది.
undefined
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్ర లోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాఢమాసం లోనే దక్షిణాయణం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయణం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకరరాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయణం అంటారు.
ఈ ఆయణంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయణం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది.. వ్యవసాయ దారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం.
ఈ శూన్య మాసంలో... ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీజగన్నాధ రధయాత్ర.. ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమిగా, ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము - సృమతి కౌస్తుభం’ ... ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమారస్వామిని దర్శించాలి. ఆషాఢశుద్ధ సప్తమి - మిత్రాఖ్య భాస్కరపూజ అని నీలమత పురణము.. ద్వాదశ సప్తమీ వ్రతము. చతుర్వర్గ చింతామణి.. ఆషాఢ శుద్ధ అష్టమి - మిహషఘ్ని పూజ, సృమతి కౌస్తుభం. ఆషాఢ శుద్ధ నవమి - ఐంద్రదేవి పూజ
ఆషాఢ శుద్ధ దశమి - శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము. ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం.. ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాం తరాది దినము అంటారు. ఈ మాసంలో జగన్నాథుని రధయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది.