న్యాయపరమైన సంపాదనతో చేసే ఏ కార్యమైనా సత్ఫలితాలను ఇస్తాయి. మన చేతులతో ఎంత దానం ఇస్తామో అంతకు రెట్టింపు ఫలితం పొందుతాము. మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా ఫలితం రాదు. వైరాగ్యం వల్ల ఏ పనిపై దృష్టి పెట్టరు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
దానధర్మాలు అనే విషయం మామూలు మాటకాదు. దాన గుణం కలిగిన వ్యక్తీ అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాడు, అంత్యమందు మోక్షాన్ని పొందుతారు. మన సంపాదనలో ఓ పది శాతం డబ్బును దానధర్మాల కోరకు సత్కార్యాల కొరకు ఖర్చు చేయాలి. పేదవారికి, అవిటి వారికి, నిర్భాగ్యులకు, వృద్దులకు, చిన్న పిల్లలకు, వితంతువులకు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి, కాలం కలిసిరాక కష్టపడుతున్న వారెవరైనా సరే వారికి మీ శక్త్యానుసారంగా ఎంతో కొంత సహాయపడండి, ఆ పుణ్య ఫలితం మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాన్ని కలుగజేస్తుంది.
న్యాయపరమైన సంపాదనతో చేసే ఏ కార్యమైనా సత్ఫలితాలను ఇస్తాయి. మన చేతులతో ఎంత దానం ఇస్తామో అంతకు రెట్టింపు ఫలితం పొందుతాము. మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా ఫలితం రాదు. వైరాగ్యం వల్ల ఏ పనిపై దృష్టి పెట్టరు. ఈ విధంగా మీ జీవితలోనూ జరుగుతున్నట్లయితే కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఇవి మీ జీవితంలో సానుకూలతను పెంపొందించడానికి ఖచ్చితంగా సహాయపడతాయి. జీవితం అనేది సుఖ-దుఃఖాల సమాహారం.
ప్రతి ఒక్కరి జీవితంలో విధివశాత్తు చుట్టూ నిరాశ అలముకొనే రోజు అంటూ ఒకటి వస్తుంది. అప్పుడు ఏ పనిలోనూ మనస్సు లగ్నం చేయలేరు. ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. రాత్రి, పగలు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం రాదు. ఇదే దిశలో మీరు కూడా వెళ్తున్నట్లయితే చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో వైఫల్యం ఎదురవుతుంటే కొన్ని నివారణలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఇవి మీ జీవితంలో సానుకూలతను పెంపొందించడానికి ఖచ్చితంగా సహాయపడతాయి. ఈ జీవితంలో వైరాగ్య ధోరణి ఎదురైనప్పుడు ఆచరించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రావిచెట్టు ప్రదక్షిణ :- గోచార గ్రహస్థితి బాగాలేనప్పుడు అనేక సమస్యలతో సతమతమౌతుంటే ప్రతిరోజూ రావిచెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవానూనేతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిధానంగా '11' ప్రదక్షిణలు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని స్మరిస్తూ చేస్తే చాలావరకు కష్టాల నుండి గట్టేక్కుతారు.
గోమాత సేవ :- సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత. వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి అద్బుతమైన ఫలితాలు కనబడుతాయి.
విఘ్నేశ్వరుని నామం స్మరించండి :- ఇంటి నుండి శుభకార్యాలకు వెళ్తుంటే మీరు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. మీరు చేయాల్సిందల్లా ఇంటి నుంచి బయల్దేరే ముందు శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించండి. వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆ పైన గణపతి దగ్గర ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కను నోట్లో వేసుకుని మీ పని కోసం వెళ్లండి. ఈ పరిహారం పాటించడం ద్వారా మీరు వెళ్లినచోట విజయం, శ్రేయస్సు పెరుగుతుంది.
ఆదివారం ఈ పని చేయండి:- ఏ పని చేపట్టినా విజయం సాధించలేనట్లయితే ప్రతి ఆదివారం నాడు రెండు చేతులు పైకి ఎత్తి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి, ఆదివారం రోజు మధుమాంసహారం తీసుకోవద్దు. ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. విజయాన్ని రుచి చూసే అవకాశముంటుంది. జీవితంలో కష్టాలు తొలగి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నలుపు దారంతో పరిహారం:- నలుపు రంగు దారాన్ని కొనుగులు చేయండి. మీ వయస్సుకు సమానమైన ముడులను దానిపై కట్టండి. అనంతరం అరటి, తులసి ఆకుల రసాన్ని ప్రతి ముడిపై వేయండి. ఆ తర్వాత పసుపు, సింధూరాన్ని దారానికి రాయండి. అనంతరం ఆ దారాన్ని కుడి చేతికి కిందగా ఉండేట్లు ధరించండి. ఈ విధంగా ఆ దారాన్ని 21 రోజుల పాటు ధరించాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న నిరాశ తొలుగి సమస్యల నుంచి ఉపశమనం పొందాడానికి ఉపయోగపడుతుంది.
రక్షాయంత్రం :- సమస్త గ్రహ బాధలు, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, దాపంత్య ఇత్యాది దోష నివారణకు పంచలోహంతో శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజింపబడిన రక్షాయంత్రం పర్సులలో కానీ జేబుల్లో కానీ పెట్టుకున్న వారికి ..ఎల్లప్పుడూ తల్లి బిడ్డను ఎలా రక్షిస్తుందో ఈ రక్షాయంత్రం అలా వారిని రక్షిస్తుంది. ఇలా మరి కొన్ని నియామనిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ రక్షాయంత్రం మనదగ్గర ఉన్నన్ని రోజులు మన నక్షత్ర, గోత్ర నామాలతో నిత్య పూజ తప్పకుండా జరిపించుకోవాలి. ప్రతి నెల తప్పకుండా శుద్ధి జరిపించు కోవాల్సిఉంటుంది. ఈ పూజ కార్యక్రామాలు అనుభావజులైన పండితులచే జరిపించుకోవాలి.
మానవ సేవ ఫలితం :- ఏవరైనా ఆపదలో ఉన్నప్పుడు తప్పక సహాయపడండి. ఎవరి పెళ్ళైన సరే అడ్డుపడకుండా... అండగా నిలవండి, ఒక మంచి జంట సంసార జీవితలో సంతృప్తి చెందితే ఆ ఫలితం మీ పిల్లల కుటుంబ జీవితంపై సత్ ఫలితాలను ఇస్తుంది. ఆడకూతురు పెళ్ళిలో మీ చేతనైన సహాయం చేయండి. ధార్మిక ధర్మకార్యా సేవలలో మీరు భాగస్వాములు కండి, వృక్షాలకు, పక్షులకు, పశువులకు తోచిన సహాయం చేయండి.
ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చండి. నోరిడిచి ఎవరైనా మిమ్మల్ని యాచిస్తే వారికి కాదనకుండా, లేదనకుండా ఎంతో కొంత సహాయపడండి, యాచించిన వారిని రిక్త హస్తాలతో పంపకండి. బాటసారులకు కానీ ఇంటికి ఎవరైనా వస్తే వారు అడగపోయినా సరే త్రాగడానికి మంచి నీళ్ళను ఇవ్వండి. ఇలా చేస్తే వారి ఆత్మారాముడు సంతృప్తి చెంది పరమాత్మ మీకు అనేక విధాలుగా మంచి చేస్తాడు.
ఈ మంత్రాలను జపించండి :- శాస్త్రాల్లో గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రాలు విజయాక్షరాలుగా పరిగణిస్తారు. రోజూ ఈ మంత్రాలను కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా గాయత్రి మాత, పరమేశ్వరుని ఆశీర్వాదం పొందుతారు. ఫలితంగా ప్రతికూల కర్మలు మీ నుంచి దూరమవుతాయి. ఏ పని చేపట్టిన అందులో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు.
రొట్టెతో పరిహారం:- ఇంటి నుండి ఏదైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లే ముందు గోధుమపిండిలో కొంచం బెల్లం కలిపి నువ్వుల నూనె వేసి తయారు చేసిన తాజా రొట్టెను మీతో పాటు తీసుకొని వెళ్లండి. మార్గం మధ్యలో కాకులు కనిపిస్తే రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు అనుకూల సమయానికి పూర్తి కావడమే కాకుండా అందులో మీరు విజయం సాధిస్తారు.
ధాన్యం గింజల పరిహారం:- అన్ని రకాల సమస్యలు, అనేక కష్టాలు మీకు ఎదురవుతుంటే నవధాన్యాలు ఒకచోట కలిపి 1. గోధుమలు 2. యవలు 3. పెసలు 4. శనగలు 5. కందులు 6. అలసందలు 7. నువ్వులు 8. మినుములు 9. ఉలవలు వీటిని రోజు ఒక దోసేడైనా పావురాలకు, పక్షులకు వేస్తూ ఉండండి .. అలాగే వాటికి త్రాగడానికి నీళ్ళను కూడా ఏర్పాటు చేయాలి. ఇలా రోజు చేయడం వలన చాలా మంచి జరుగుతుంది.