దీపావళి, నరకచతుర్ధశి రెండు ఒకే రోజు వచ్చాయా? ఏ రోజు ..ఏ పండగ చేసుకోవాలి

By telugu news teamFirst Published Nov 7, 2023, 9:44 AM IST
Highlights

ఆశ్వీయుజ మాసంలో ప్రదోష కాలానికి (సాయింకాలం) ఏ రోజు అమావస్య ఉంటుందో ఆ రోజే  దీపావళి గా పరిగణిస్తారు. ఆ విధంగా దీపావళి ని కూడా అదే రోజు అంటే నవంబర్ 12  వ తేదీని జరపాలి. 

దీపాల వెలుగుల పండుగ దీపావళి (Diwali) ని ఈ సారి మరింత  ఆనందంగా జపుపుకునేందుకు అందరం సిద్దమవుతున్నాము. జీవితంలో చీకట్లని పారదోలి.. వెలుగు నింపాలని అందరూ ఈరోజు సంప్రదాయబద్దంగా  ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఎంత శ్రద్దతో ఆ పండగను జరుపుకుంటే అంత లా జీవితంలో కష్టనష్టాలు తొలగటమే కాకుండా...గే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి.. ఏడాదంతా సిరిసంపదలు కురస్తాయని చెప్తారు.  

ఈ సారి నరక చతుర్ధశి, దీపావళి ఒకే రోజు వచ్చాయి. దాంతో దీపావళి ఏ రోజు చేయాలి, నరక చతుర్ధసి ఏ రోజు చేయాలి,లేదా ఒకే రోజు చేయాలా  అనే సందేహం వచ్చింది. ఆశ్వయుజ బహుళ చతుర్ధశిని నరక చతుర్ధసి అంటారు. చతుర్ధశి అరుణోదయ కాలంలో ఉన్ననూ, లేదా సూర్యోదయం వరకూ ఉన్ననూ ఆ దినమే నరక చతుర్దశిగా పరిగణించాలి. ఈ రెండు సమయాలు రెండు కలిగి ఉన్న రోజు నవంబర్ 12 కాబట్టి ఆ రోజు నరక చతుర్ధశి. నరక ప్రాప్తి లేకుండా చేసుకునుటకు అందరూ కూడా ఈ రోజున నువ్వులు నూనె తో అభ్యంగన స్నానం చేయాలి. 

దీపావళి విషయానికి వస్తే... ఆశ్వీయుజ మాసంలో ప్రదోష కాలానికి (సాయింకాలం) ఏ రోజు అమావస్య ఉంటుందో ఆ రోజే  దీపావళి గా పరిగణిస్తారు. ఆ విధంగా దీపావళి ని కూడా అదే రోజు అంటే నవంబర్ 12  వ తేదీని జరపాలి.  అంటే నవంబర్ 12న మధ్యాహ్నం 1.48 నిముషాల దాకా చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అమావస్యగా జరుపుకోవాలి.

అలాగే దీపావళి రోజు సాయింత్రం లక్ష్మీ పూజ చేసుకోవాలి.  సనాతన ధర్మంలో దీపావళి అమావాస్య రోజంటే... రామాయణంలో రాముడు అయోధ్యకు వచ్చిన రోజు, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు, మహాభారతంలో నరకాసురుడిని వధించిన రోజు, పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు.  కాబట్టి ఎంతో ఆనందంగా సంప్రదాయ బద్దంగా జరుపుకోవాలి.

అలాగే దీపావళి రోజు ఎవరైతే తెల్లవారు జామున తలస్నానం ఆచరిస్తారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది.  నదీ ప్రవాహంలో గానీ, సముద్రంలో గానీ తలస్నానమాచరించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొంటోంది. అందువల్ల నరక చతుర్దశి లేదా దీపావళి రోజున తలస్నానమాచరించడం తరతరాలుగా వస్తున్న ధర్మం.

జోశ్యుల రామకృష్ణ 
 ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు
.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!