Nagula Chavithi 2023: నాగుల చవితి నాడు సర్ప దేవతలను పూజిస్తారు. ఈ పండుగను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగను జరుపుకోవడం వెనుక అసలు కారణమేంటో ఎంత మందికి తెలుసు?
Nagula Chavithi 2023: నాగుల చవితికి హిందూ పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ సందర్భంగా నాగదేవతలను పూజిస్తాం. ఈ రోజు ప్రజలు నాగులకు పూజ చేసి వాటి ఆశీర్వాదం తీసుకుంటారు. నాగుల చవితిని ప్రతి ఏడాది కార్తీక మాసంలో శుక్లపక్షం చతుర్థి తిథి నాడు జరుపుకుంటాం. ఈ ఏడాది ఈ పండుగను ఈ రోజే జరుపుకుంటున్నాం.
నాగుల చవితి తేదీ, సమయం
undefined
చవితి తిథి ప్రారంభం - నవంబర్ 16 - 12:34 PM
చవితి తిథి ముగింపు - నవంబర్ 17 - 11:03 AM
నాగుల చవితి పూజ ముహూర్తం - నవంబర్ 17, ఉదయం 10:24 నుంచి 11:03 వరకు
నాగుల చవితి ప్రాముఖ్యత
నాగుల చవితి పండుగ నాగదేవతలను పూజించడానికి అంకితం చేయబడింది. ఈ రోజు నాగ దేవతలను నిష్టగా పూజిస్తారు. పరమేశ్వరుడి మెడలో వాసుకి అనే పాము నివసిస్తుంది కూడా. అందుకే శివుడు నాగభూషణం అనే పేరుతో కూడా పిలువబడుతున్నాడు. విష్ణుమూర్తి కూడా శేష నాగునిపై విశ్రమిస్తాడు. అందుకే ఈ దేవుడిని మంన శేషతల్ప సాయిగా భావిస్తాం. అలాగే గణేషుడిని నాగ యజ్ఞోపవీతుడు అని కూడా అంటుంటాం.
నాగుల చవితి పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పవిత్రమైన నాగ చవితి రోజు ఆడవారు నిష్టగా ఉపవాసం ఉంటారు. నాగదేవతలను పూలు, పాలతో, నియమాల ప్రకారం పూజిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నాగును రాహు గ్రహం అని కూడా అంటారట.
పాములను ఆరాధించే సంప్రదాయం హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పాములను పూజించడం వల్ల పిల్లల శ్రేయస్సు భాగుంటుందని నమ్ముతారు. అందుకే పెళ్లైన ఆడవారు తమ పిల్లల కోసం నాగదేవతలను పూజిస్తారు. నిజానికి గ్రామీణ ప్రాంతాలకు పాములు చేసే మేలు ఎంతో. ముఖ్యంగా పంటలను నాశనం చేసే ఎలుకల బెడదను పాములు లేకుండా చేస్తాయి. సాధారణంగా పాములు చలికాలంలో బొరియల నుంచి బయటకు వస్తాయి. దీంతో అవి ఎలుకలను తింటాయి. అలాగే పంట నేలను సారవంతం చేయడానికి కూడా పాములు సహాయపడతాయి. అలాగే మంచినీళ్లలోని హాని చేసే సూక్ష్మజీవులను పాములు తొలగిస్తాయి.
నాగుల చవితి ఆచారాలు
నాగుల చవితి నాడు తెల్లవారుజామునే నిద్రలేస్తారు. తలస్నానం చేసి నాగదేవత విగ్రహానికి పూజ చేస్తారు. ఈ రోజు నువ్వుల లడ్డూలు, బియ్యం పిండి, బెల్లంతో చేసిన తీపి వంటకాలు, పప్పులతో చేసిన వంటకాలను నాగేంద్రుడికి సమర్పింస్తారు.
పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు