కార్తీక మాసం 2023: ఈ పవిత్రమైన మాసంలో ఈ పనులను అస్సలు చేయకండి

By Shivaleela Rajamoni  |  First Published Nov 16, 2023, 10:31 AM IST

Karthika Masam 2023: కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. అందుకే ఈ మాసంలో కొన్ని పనులను చేయకూడదు.  అలాగే కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అవేంటంటే?
 


Karthika Masam 2023: కార్తీక మాసంలో శివుడిని, మహావిష్ణువును పూజిస్తారు. ఈ దేవుళ్లకు ఈ కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైంది. ఈ పవిత్రమైన మాసంలో చంద్రుడు పూర్తి శక్తితో నిండి ఉంటారు. ఈ మాసంలో శివుడిని, శిష్ణుమూర్తిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని రకాల బాధల నుంచి బయటపడతారని భక్తుల నమ్మకం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం.. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. దామోదరుడు అంటే గోపాలుడు. ఈ దేవుడికున్న మరో పేరు దామోదరుడు. కాగా ఈ పవిత్రమైన మాసంలో భక్తులు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కార్తీక మాసంలో చేయాల్సినవి

  • కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి.
  • ఈ మాసంలో మర్చిపోకుండా ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ మాసంలో తులసికి ఎంతో ప్రముఖ్యత ఉంది. అందుకే ఈ మాసంలో తులసిని నిష్టగా పూజిస్తారు.
  • కార్తీక మాసంలో మట్టి దీపం లేదా పిండి దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు. అలాగే పవిత్రనదిలో స్నానం ఆచరిస్తారు. 
  • ఈ పవిత్రమైన మాసంలో భగవద్గీతను పఠించడం శుభప్రదంగా భావిస్తారు. 
  • ముఖ్యంగా ఈ మాసంలో బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. 
  • ఈ మాసంలో చాలా మంది నేలపైనే పడుకుంటారు. ఎందుకంటే దీనివల్ల మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు రావు. 

Latest Videos

కార్తీక మాసంలో చేయకూడనివి

  • కార్తీక మాసంలో చేపలు, చికెన్, మటన్ వంటి మాంసాహారాలను తినకూడదు.
  • ఈ మాసంలో చాలా మంది కాకరకాయ, వంకాయ, జీలకర్ర వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉంటారు. 
  • అలాగే ఈ మాసంలో బఠానీలు, పెసరపప్పు, మినప పప్పు వంటి తృణధాన్యాలను తినకూడదు. 
  • కార్తీక మాసంలో నూనె రాసుకోకూడదంటారు. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత శరీరానికి నూనె రాసుకోకూడదు. 
  • కార్తీక మాసంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ మాసంలో కోపగించుకోకూడదు. మొరటుగా కూడా ఉండకూడదు.
  • అలాగే ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకూడదు.
click me!