Nagula Chavithi 2023: నాగుల చవితి నాడు ఎలా పూజ చేయాలి?

Published : Nov 17, 2023, 11:42 AM IST
Nagula Chavithi 2023: నాగుల చవితి నాడు ఎలా పూజ చేయాలి?

సారాంశం

Nagula Chavithi 2023: నాగుల చవితిని నాగుల చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ రోజు నాగదేవతలను నిష్టగా పూజిస్తారు. మరి ఈ రోజు నాగదేవతలకు ఎలా పూజాలు చేయాలంటే?   

Nagula Chavithi 2023: నాగ అంటే పాము. చతుర్థి అంటే చాంద్రమాన మాసంలోని నాల్గో రోజు అని అర్థం. ఈ పండుగను మనం ప్రతి ఏడాది కార్తీక మాసంలో జరుపుకుంటాం. నాగ చవితి పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగ దేవతలను పూజించడం వల్ల పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రజల నమ్మకం. అలాగే ఈ రోజు పూజ చేయడం వల్ల నాగదోశం కూడా తొలగిపోతుందంటారు జ్యోతిష్యులు. మరి ఈ రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. 

నాగుల చవితి ప్రాముఖ్యత

నాగుల చవితి నాడు ఆడవారు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం వల్ల తమ పిల్లలు, భాగస్వాుమలు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవిస్తారనే నమ్మకం ఉంది. ఈ రోజు నాగదేవతలను పూజిస్తే కాల సర్ప దోషం తొలగిపోతుంది. అలాగే రాహు కేతు దోషాలు కూడా పోతాయని నమ్మకం ఉంది. ఈ రోజు నాగదేవతలను పూజించి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుళ్లను మొక్కుతారు. 

నాగుల చవితి పూజా విధి

  • నాగచవితి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. 
  • ఈ రోజు సర్పదేవతలకు, పాము విగ్రహాలకు, చిత్రపటాలకు పూజలు చేస్తారు. అలాగే పాలను సమర్పిస్తారు. 
  • ఈ రోజు కుటుంబమంతా సంతోషంగా ఉండాలని ఆడవారు ఉపవాసం ఉంటారు. 
  • నాగచవితి నాడు నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకం చేస్తారు.
  • నాగదేవతలకు కుంకుమ, పసుపు బొట్టు పెడతారు. అలాగే దేవతల ముందు దీపాన్ని వెలిగిస్తారు. 
  • ఆ తర్వాత నాగదేవతలకు, దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారు. 
  • పూజా సమయంలో మంత్రాన్ని పఠించాలి.

నాగ చవితిని జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

నాగ చవితి నాడు రాహువు, కేతువులను పూజిస్తారు. దీనివల్ల వీటి చెడు ప్రభావం మీపై ఉండదు. అలాగే ఈ రోజు నాగదేవుళ్లను, దేవతలను పూజిస్తే ఎన్నో ఏండ్లుగా ఉన్న పాము శాపం నుంచి విముక్తి పొందుతారు. ఇక నాగుల చవితి నాడు ఉపవాసం ఉండే వారి కుటుంబం ఆనందంగా, సంతోషంగా ఉంటుందనే నమ్మకం ఉంది. నాగ చవితి నాడు పూజ చేసేవారికి జాతకంలో ఉన్న పాము దోషం పోతుందట. 

PREV
click me!