Nagula Chavithi 2023: నాగుల చవితి కూడా హిందూ పండుగల్లో ఎంతో పవిత్రమైన పండుగ. ఈ రోజున భక్తిశ్రద్ధలతో నాగేంద్రుడిని పూజిస్తారు. ప్రతి ఏడాది నాగుల చవితిని కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత అంటే నాల్గో రోజున ఈ పండుగను జరుపుకుంటారు. నాగ చతుర్థి తర్వాత నాగ పంచమి, నాగశష్టిని జరుపుకుంటారు.
Nagula Chavithi 2023: నాగుల చవితి నాగేంద్ర పూజ చేయడానికి అనుకూలమైన రోజు. ఈ పండుగను ప్రతి ఏడాది కార్తీక మాసంలో జరుపుకుంటారు. అటే దీపావళి అమావాస్య తర్వాత నాగుల చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజున ఆడవారు నిష్టగా ఉపవాసం ఉంటారు. నాగేంద్రుడిని పూజిస్తారు. పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పూజ చేస్తారు.
నాగుల చవితిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటలోని చాలా ప్రాంతాల్లో ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసకుంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేస్తారు. ఉపవాసం ఉండి నాగదేవతల విగ్రహం ఉన్న ఆలాయాలకు వెళతారు. పూజలు చేస్తారు. ముఖ్యంగా సుఖ సంతోషాలు, సౌభగ్యాలు కలగాలని నాగేంద్రుడికి పసుపు, కుంకుమలను సమర్పిస్తారు. జీవితంలో కష్టాలు తొలగిపోవాలని దీపం వెలిగించి దీవించమని మొక్కుకుంటారు.
undefined
నాగుల చవితి తేది, పూజా సమయం
చవితి తిథి ప్రారంభం: నవంబర్ 16 - 12:36
చవితి తిథి ముగింపు: నవంబర్ 17 - 11:05
నాగుల చవితి ఆడవారికి సంబంధించిన పండుగ. ఈ పండుగ నాడు నాగదేవతలను పూజిస్తారు. పెళ్లైన ఆడవారు తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ఈ పండుగను జరుపుకుంటారు. మీకు తెలుసా? ఈ పండుగ నాడు నిష్టగా పూజలు చేస్తే సంతానం కలుగుతుందని కూడా నమ్ముతారు. సంతానం ఉన్నవారు పిల్లల శ్రేయస్సు కోసం నాగుల చవితి నాడు పూజలు చేస్తారు.
తెలుగు హైందవ సంస్కృతిలో నాగుల చవితికి సంబంధించిన ప్రసిద్ధ పురాణం ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం.. సముద్ర మంథనం సమయంలో ఈ విశ్వాన్ని రక్షించడానికి పరమేశ్వరుడు హలహల లేదా కల్కుట అనే విషాన్ని తాగాడు.
కాగా నాగుల చవితి నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాగేంద్ర ఆలయాల్లో పూజలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నాగదేవతలు కొలువున్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.