ఏమికాదులే... స్థలం వృధా చేయకూడదు అని భావించి, చిన్ని మార్పులు చేసుకుంటే ఏమౌతుందిలే అని సొంత నిర్ణయంతో తీసుకుని చేసే పనులలో వాస్తు పరంగా మొదటికే మోసం రావచ్చును...
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
స్వంత ఇంటి కల సాకారం చేసుకొనుటకు కష్టార్జితాన్నంతా దాచుకుని, పోగుచేసుకుని.. ఆ డబ్బులు వెచ్చించి గృహ నిర్మాణం సాగిస్తున్నప్పుడు, చిన్న చిన్న విషయాలలో రాజీ పడితే మీ 'కలలసౌధం' కకావికలం అయ్యే ప్రమాదం ఉన్నది. కావున కట్టేది చిన్న ఇల్లు అయినా ఏ విషయంలోనూ రాజీ పడకండి. ఆ రాజీ పడకూడని అంశాలేమిటో చూద్దాం ..
* ఇల్లు నిర్మిస్తున్నప్పుడు అనుభవజ్ఞులై వాస్తుశాస్త్ర పండితుని, ఇంజనీర్ యొక్క సలహాను తప్పక తీసుకొండి. వాస్తు పండితుని సలహాకు మీరిచ్చే ఫీజు కంటే వారిచ్చే సలహాల వలన మీకు కలిగే లాభాలు ఎన్నో ఉంటాయి. శాస్త్ర పరమైన విషయాలలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఒక్క సారి కట్టిన ఇల్లు దాని ఆయు:ప్రమాణం పూర్తయ్యే వరకు వెనక్కు తిరిగి చూడకుండా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. ఈ శాస్త్ర సూత్రాలు తెలుసులే అని సొంత బుద్దిని ఉపయోగించకూడదు. శాస్త్రంలో చూడవలసిన మెలుకువలు, సూక్ష్మ పరిశీలనలు చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి, అవి శాస్త్రపాండిత్యం తెలిసిన నిష్ణాతులకే సాధ్యమౌతుంది.
* అనుభవజ్ఞులైన పండితుడి సలహాలను తీసుకుని...పండితునికి తెలియకుండా ప్రతిది పాటించాలా ఒకటి రెండు పాటించకుంటే ఏమికాదులే... స్థలం వృధా చేయకూడదు అని భావించి, చిన్ని మార్పులు చేసుకుంటే ఏమౌతుందిలే అని సొంత నిర్ణయంతో తీసుకుని చేసే పనులలో వాస్తు పరంగా మొదటికే మోసం రావచ్చును... అవే ఏమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.
1 ) సరి సంఖ్యలో ఉండాల్సిన ద్వారాలు, కిటికీలు బేసి సంఖ్యలలో పెట్టుకోవడం.
2) ఇంటి కాంపౌండ్ గోడకు ఆనించి మెట్లు లేదా ఇతర వసతులను ఏర్పాటు చేసుకోవడం.
3) ఇంటి గోడకు ప్రహరి గోడకు ఎలాంటి కనెక్షన్ ఉండకూడదు.
4) కొంత మంది ఇంటి ప్రహరి గోడకు మరియు ఇంటి గోడలకు ఆనుకుని బాత్రూం లేదా పనివాల్లకు చిన్న రూమ్ నిర్మిచడంమో లేకా పెంపుడు జంతువుల కోసం గదిని నిర్మాణం చేస్తూ వాస్తును దెబ్బతీస్తారు.
5) మెట్ల క్రింద స్టోర్ రూమ్ అని లేదా బాత్రూం అని అధనంగా కడుతుంటారు. ఇది పూర్తి వాస్తు విరుద్దం.
6) ఇంటి వాడకం నీళ్ళను పైప్ లైన్ తగ్గుతుంది కదా అని పశ్చిమ రోడ్డున్న ఇంటి వారు నైరుతి నుండి బయటకు నీళ్ళు వెళ్ళేలా కనెక్షన్స్ ఇప్పిస్తుంటారు ఇది దోషం.
7) ఈశాన్యంలో బరువైన వస్తువులు వేస్తూ ఉండడం కూడా దోషమే.
8 ) ఇల్లు కడిగిన నీళ్ళు తూర్పు లేదా ఉత్తరం వైపు దిశల నుండి బయటకు వెళ్ళడం ఉత్తమం, పడమర లేదా దక్షిణం వైపు వెళ్ళకూడదు.
9) ఇంటి నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకారంలో మాత్రమే ఉండాలి. రైల్ డబ్బా లాగా పొడువుగా కూడా నిర్మాణం చేయకూడదు.
10) ఈశాన్యం గదిలో దంపతులకు బెడ్ రూమ్ ఏర్పాటు అస్సలు ఉండ కూడదు.
11) ఎక్కువ అంతస్తులు కలిగిన బిడ్లింగ్ లో అన్న దమ్ములు ఎవరు ఎక్కడ ఉండాలి, తలిదండ్రులు ఎక్కడ ఉండాలి అనే ప్రశ్నకు శాస్త్ర ప్రకారం సమాధానం.. ఉదాహరణకు యజమానికి ముగ్గురు కొడుకులు ఉన్నారు అనుకుందాం. అప్పుడు తలిదండ్రులు గౌండ్ ప్లోర్ లో ఉండాలి, పెద్ద కొడుకు మొదటి అంతస్తులో, రెండవ కొడుకు రెండవ అంతస్తులలో, మూడవ కొడుకు మూడవ అంతస్తులో ఉండాలి, ఒకవేళ తలిదండ్రులు లేనివారు పెద్ద కొడుకు గౌండ్ ఫ్లోర్ లో ఉండాలి, రెండవ వాడు మొదటి అంతస్తులో ఉండాలి. ఈ పద్దతిలో ఉండాలి.
12) అంతస్తులు లేకుండా ఉండే ఇంట్లో నైరుతి బెడ్ రూమ్ లో తలిదండ్రులు, దక్షిణ భాగం అంటే మాస్టర్ బెడ్ రూమ్ కుడివైపు మొదటి సంతానం, ఎడమ వైపు రెండవ సంతానం ఉండాలి.
13 ) వయసొచ్చిన తలిదండ్రులను పొరపాటున కూడ హాల్ లో పడుకో బెట్టకూడదు, అలాగే ఇతర బెడ్ రూమ్ లలో కూడ వద్దు కేవలం నైరుతి భాగంలో వాళ్ళు ఉంటే అందరికి శ్రేయస్కరం.
14) ఇంటి గుమ్మం ముందు సంపులు, మ్యాన్ హోల్స్, బోర్ , గొయ్యిలు లాంటి ఉండకూడదు.
15) వంటను ఆగ్నేయదిశలో తూర్పు ముఖం చేసి వంట చేసుకునేలా ఉండాలి.
16) పూజ గదిలో దేవుడి పటాలు, విగ్రహాలు తూర్పు లేదా పడమర గోడలకు మాత్రమే అమర్చుకోవాలి.
17) సంపులు నైరుతి, వాయువ్య, ఆగ్నేయ దిశలలో నిర్మిస్తే కష్టాలు తప్పవు.
18) ఇంటి బైట ప్రధాన గుమ్మం పైన ఎలాంటి దేవుడి పటాలు ఉండకూడదు. కేవలం ఓం, స్వస్తిక్, కలశం, తిరునామాలు లాంటివి పెట్టుకోవచ్చును.
19) ఇంటి ప్రధాన (ద్వారం) గుమ్మం లోపలి వైపు ద్వారంపై భాగంలో గోమాత సమేత భోజపత్ర యంత్ర సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకల పటం ఉండడం సర్వత్రా శ్రేయస్కరం... ఈ అమ్మవారి పటానికి పూజ నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి, తెలుసుకోవాలని ఆ శక్తి కలవారికి మమ్మల్ని సంప్రదిస్తే ఫోన్ ద్వారా తెలియజేయగలం. ఇన్ని విశేషాలు గల ఈ పటం అన్ని చోట్ల దొరకవు, ఇవి లభించుచోటును కూడా సూచించడం జరుగుతుంది.
19) ఇంటికి ఒకే దిక్కున మూడు ద్వారములు ఉండ కూడదు.
20) ఇంటి నిర్మాణం అంటే ఎన్నో లక్షలు, కోట్ల ఖర్చుతో కూడుకుని ఉంటుంది, ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు నిర్మించుకుంటారు. ఇల్లు ఎంతటి బడ్జెట్ లో నిర్మించుకున్నా.. ఎంతటి వాస్తు ప్రకారమే కట్టుకున్ననూ సరే తప్పక నాలుగు దిశలలో పంచలోహాములతో తయారు చేసిన "మత్స్యయంత్రాలు" శాస్త్రోక్తంగా పూజలు జరిపించి స్థాపన జరిపించుకుంటే.. ఆ శక్తి వలన సమస్త వాస్తు దోషాలను హరించి వేస్తుంది. కొంచం ఖర్చుతో కూడుకున్నది అయిననూ వెనక్కు తగ్గకూడదు... ఎందుకంటే ఈ యంత్రాలు ఏ ఇంట్లో స్థాపన చేయబడుతుందో ఆ ఇంట్లో నివసించే వారందరికి ఎన్నో విధాలుగా మేలునుచేస్తుంది, వాస్తు దోషాలు, శల్య దోషాలు, నరదృష్టి దోషాలు, ఖగోళ ద్వార ఏర్పడే (కాస్మిక్) దోషాలు, స్థల దోషం, ఇరుగుపొరుగు ప్రదేశాల ( గుడి, మసీద్, చర్చ్ నీడలు ఇంటి పై పడే వాటికి, పరిసర ప్రాంతంలో స్మశానాల ) వలన ఏర్పడే దోషాలు. వర్గు దోషం... ఇలాంటి అనేక దోషాలకు ఈ మత్స్యయంత్రాలు శక్తివంతగా ఉపయోగపడుతాయి. ఈ యంత్రాలు పాత ఇండ్లలో కూడా స్థాపన చేసుకోవచ్చును. దీనిపై మీకేమైన సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
* నైరుతి మూల ఓపెన్ పెట్టడం, కిటికీలు పెట్టడం మంచిది కాదు.
* దిక్సాదన లేకుండా ఇల్లు నిర్మాణం చేయకూడదు.
* శంఖుస్థాపన ఈశాన్యమ్ దిశలో చేయకూడదు. శంఖుస్థాపనకు వాస్తు రిత్య ప్రత్యేక స్థలం అంటూ ఒకటి 'నాభి' స్థానం అని ఉంటుంది. ఇది ఇంటి స్థలం కొలతల ద్వార నిర్ణయించాల్సి ఉంటుంది.
* ఇంటి ప్రధాన గుమ్మం గడప కుడివైపు శేరెడులో నాణ్యమైన ముత్యం, పగడం, పంచలోహాలు తప్పక వేసుకోవాలి.
* బోర్ లేకా బావి అనేది ఈశాన్యంలో ఉండాలనేది వాస్తవమే కానీ మూలలలో పడకుండా జాగ్రత్త పడాలి.
* నిర్మాణానికి కావలసిన మెటిరియాల్ పొరపాటున కూడా ఈశాన్యం వైపు వేయకూడదు. నైరుతి అనుకూలం.
* చైత్రం, జ్యేష్టం, ఆషాఢ, భాద్రపద, ఆశ్వీయుజ, మార్గశిర, పుష్య మాసాలలో ఎట్టి పరిస్థితులలో గృహనిర్మాణం ప్రారంభం చేయకూడదు.
* గృహ ప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖ, జ్యేష్ట, శ్రావణం, కార్తీకం, మాఘ, ఫాల్గుణ మాసాలో జరుపుకుంటే శుభం కల్గుతుంది. ఇతర మాసాలు ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయి.
* పడమర, దక్షిణం వైపు దిశలు ఎత్తుగా ఉండాలి. పల్లం తూర్పు, ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి.
* ఈశాన్యం ఎత్తుగా ఉండి నైరుతి పల్లంగా ఉంటే సర్వనాశనం చేస్తుంది.
* ఈశాన్య స్థలం పెరగాలి అనే నానుడి ఉంది కదా అని ఇష్టం వచ్చిట్లు పెంచుకోవడం కూడా దోషమే అవుతుంది.
* మరుగు దొడ్డి తూర్పు, పడమర ముఖం చేసి కూర్చోవడం హానికరం.
* వాష్ బేషన్ కూడా ఉత్తర, దక్షిణ గోడలకు అమర్చుకోవాలి. తూర్పు, పడమర ముఖం పెట్టి కడుక్కోకూడదు.
* కిచ్చెన్ లో శింక్ ఈశాన్యం లేకుండా చూసుకోవాలి.
* కిచ్చెన్ లో ( స్టౌవ్) పొయ్యి భీమ్, దూలం క్రింద పడకుండా జాగ్రత్త పడాలి.
* ఇంటికి నాణ్యమైన సిమెంటు, స్టిల్, కర్రను మాత్రమే వాడండి. తక్కువ ధరకు వస్తుందని నాసిరకం నిర్మాణ సామాగ్రిని వాడకండి.
* నిజాయితీ పరుడైనా, పనిమంతుడైన సుతారి 'మేస్త్రిని' ఎంచుకొండి. తక్కువ రేటుకు వస్తున్నాడని అనుభవం లేని నిజాయితీ లేని సుతారిని నియమించుకుని ఇబ్బందులు పడవద్దు.
* ఇల్లు నిర్మాణం జరుగుతున్నప్పుడు అటువైపుగా ఆవులు దూడలు వస్తే నిర్మాణం జరుగుతున్న స్థలంలో వాటికి గ్రాసం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. గోవులు మూత్రం, పేడ వేసేవరకు అక్కడే ఉంచుకోవడం చాలా మంచిది, వీలైతే ఒక రోజు అక్కడే ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
* ఇల్లు కట్టడం పూర్తి చేసిన తర్వాత మంచి ముహూర్తం పెట్టించుకుని గృహప్రవేశం, గణపతిహోమం, వాస్తుపూజ, ఇంటికళ్యాణం , శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతం జరిపించుకోవడం ఎంతమాత్రం మర్చిపోవద్దు. ఈ కార్యక్రమాన్ని వాయిదాలు వేయడం సరికాదు.