శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతుంది. ఈ శ్రీ వికారి నామ సంవత్సర మాఘమాస కృష్ణ పక్షమి ఇంగ్లీషు తేది ప్రకారం 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం రోజు వస్తుంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది.
మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతుంది. ఈ శ్రీ వికారి నామ సంవత్సర మాఘమాస కృష్ణ పక్షమి ఇంగ్లీషు తేది ప్రకారం 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం రోజు వస్తుంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది.
బిల్వార్చన :-
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణ చేసి జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము / విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివని పంచాక్షరి మంత్రం పఠిస్తారు.
undefined
ఆధ్యాత్మిక శక్తి :-
తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు ఉత్తర ధ్రువంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి. మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.
మోక్షమార్గాలు :-
ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు పరమేశ్వరునికి భోజనం నివేదన చేసి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.
శివ భక్తులు అందరూ శివరాత్రిని బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలమందికి తెలియదు. 'రా' అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద - రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది.
పూజా విధానం :-
హే రాత్రే అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి అరటి, జామకాయ మొదలగు పండ్లను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి.
చదువుకోవలసినవి :-
పూజా సమయంలో శివ అష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పెద్దలు అంటారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151