నేటి నుండి డోల్లు కత్తెర (చిన్నకత్తెర) ప్రారంభం

By telugu news teamFirst Published May 4, 2020, 11:08 AM IST
Highlights

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు. అంటే భరణి నాలుగో పాదం, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసంలో వాస్తు కర్తరి సమయములు : -

04 మే 2020 నుండి 10 మే 2020 వరకు డొల్లు కర్తరి. 

11 మే 2020 నుండి 29 మే 2020 వరకు నిజ కర్తరి.

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు. అంటే భరణి నాలుగో పాదం, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. 

డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో (డిగ్రీల 23°-20' నిమిషాలు ) నుండి వృషభరాశిలో ( డిగ్రీల 26°-40' నిమిషాలు ). సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే “డొల్లు కర్తరీ” ప్రారంభమవుతుంది. దీనినే "చిన్న కర్తరీ" అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై "నిజకర్తరి" ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.

కర్తరీలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి :-

కర్తరిలో గృహసంబంధమయిన పనులు చేయవద్దన్నారు. నాటి రోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేది కాదు. వేసవి నుంచి వడగాలుపుల నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి, కర్ర, రాతి మొదలగు పనులను వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు. భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు డోల్లు కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం, 
దేనికి కత్తెర? ఎండలో పనికి కత్తెరనమాట. వేసవిలో మే నెలలో 4, 5 తారీకుల మొదలు మే 27, 28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్ల బడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.

కర్తరీలో చెట్లు నరకటం, నారతీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని త్రవ్వటం, తోటలు వేయటం, చెఱువులు, బావులు, కొలనులు త్రవ్వటం, కొత్త బండి కొనటం, అదిరోహించటం, నూతన గృహ నిర్మాణం చేయటం, పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు, దేవాలయాలు కట్టుట చేయరాదు.

కర్తరీలో చేసుకునే పనులు :- కర్తరీలో ఉపనయనం, వివాహం, ప్రవేశాలు, యజ్ఞం, మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.

click me!