మెచ్చిన వారిలోనూ నచ్చనివి ... అంతా కర్మ!

By telugu news teamFirst Published Jul 4, 2020, 10:03 AM IST
Highlights

ఏ సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం లేకుండా జీవించడం అనేది సాధ్యపడదు, కాదు. కాని సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము, విషాదం కూడా కలిసే ఉంటుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

పాలను ఆశించి గోవును పోషిస్తాము, గోవు నుంచి మనకు పాలు వస్తాయి. అంతే కాదు ఆవు నుండి పేడ కూడా వస్తుంది, పాలను ఇంట్లోకి తెచ్చుకుంటాం,పేడని ఇంటికి దూరంగా విసిరేస్తాం.

ఆవు నుండి పాలు మాత్రమే రావాలి పేడ రాకూడదు అంటే వీలు కాదు, కర్మలు కూడా ఇలాగే ఉంటాయి ….. ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా ఉంటుందని చెప్పలేము, కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది. సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. 

ఏ సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం లేకుండా జీవించడం అనేది సాధ్యపడదు, కాదు. కాని సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము, విషాదం కూడా కలిసే ఉంటుంది. మనం ఎవరితో కలిసి జీవింస్తున్న వారిలో  తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, భార్యా భర్తలు కావచ్చు స్నేహితులే కావచ్చును, ఇంకా ఏ ఇతర బంధలైనా కావచ్చు వారిలో అన్నీ మనకు నచ్చిన గుణాలే ఉంటాయని చెప్పలేము.

మనకు నచ్చనివి వారు మెచ్చేవి కూడా ఉంటాయి …. అలాంటివి ప్రేమకి సౌఖ్యానికి ప్రతిబంధకాలే కావచ్చు, కాని అవి లేకుండా
సంబంధాలు లేవు గులాబీల మధ్య ముళ్ళు ఉన్నట్లు సంబంధాలలో ఈ విధమైన సంఘర్షణలు తప్పవు.

భోజనం చేయాలి ఆకును పడేయాలి. కాని ఆకు లేకుంటే వడ్డించటమే జరగదు, ఆకలి తీరదు ఆకలి అన్నం తోనే తీరుతుంది.
అన్నం ఆరగించినంత వరకు ఆకును ఆదరిస్తూనే పోవాలి, పడేసేదే కదా అనుకోవచ్చు కడుపులో అన్నం పడే ఆకు మన ముందే ఉండాలి.

ఈ ప్రపంచంలో ఏది అవసరం లేని క్షణం ఒకటి రావచ్చు. కాని అవసరాలలో ఆవశ్యంగా తొంగిచూసే అనవసరాలను కూడా
పెద్ద మనసుతో అంగీకరించే తత్త్వం, ఉన్నదాంట్లో సంతృప్తి పెంచుకుంటేనే అభివృద్ధిని సాధించటం మనిషికి సాధ్యపడుతుంది.

ఏది ఏమైనా మనకు అందరితో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని అనుకోవడం వెర్రి తనమే అవుతుంది. నీకు ఇష్టమైన విషయాలు ఎదుటి వారికి ఇబ్బందిగా ఉండ వచ్చును. కావునా మనిషి జీవితం తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలి. మనకు ఏర్పడే బంధాలు అన్ని మనకు అనుకూలంగా ఉండవనే సత్యం తెలుసుకున్న వ్యక్తీ కర్మయోగి అవుతాడు. 

click me!
Last Updated Jul 4, 2020, 10:05 AM IST
click me!