Diwali 2023: ఏ పండుగైనా, ఎలాంటి శుభకార్యం చేసినా మనం ముందుగా వినాయకుడికే పూజ చేస్తాం. వినాయకుడి ఆశీస్సులు మనపై ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అసలు దేవుళ్లందరిలో వినాయకుడినే ఎందుకు ముందుగా పూజిస్తామో తెలుసా?
Diwali 2023: రేపే దీపావళి పండుగ. ఈ పండుగ రోజు ఇంటినిండా దీపాలను వెలిగిస్తాం. రకరకాల పిండివంటలు, కమ్మని స్వీట్లను తయారుచేస్తాం. ముఖ్యంగా ఈ పండుగ రోజు లక్ష్మీదేవి, వినాయకుడిని నిష్టగా పూజిస్తాం. ఈ పండుగకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో ఆర్థిక సమస్యలు రావని నమ్ముతారు. అయితే ఈ పండుగకు ఒక్క లక్ష్మీదేవికే కాదు వినాయకుడికి కూడా పూజ చేస్తాం. ఒక్క దీపావళి కే కాదు ఏ పండుగకైనా సరే మనం ముందుగా వినాయకుడికే పూజ చేస్తాం.. ఇలా ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ పురాణాల ప్రకారం.. వినాయకుడు 'ప్రథమ పూజ్యుడు'. ఈ పేరు వెనుక ఎంతో కథ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి.
పురాణాల ప్రకారం.. పార్వతీదేవి ఒకసారి స్నానానికి వెళ్లే ముందు తన శరీరానికి ఉన్న పసుపును తీసి ఒక అందమైన బాలుడిని సృష్టించింది. అతనికి వినాయకుడు అనే పేరును పెట్టి ఎవరినీ ఇంట్లోకి రానీయొద్దని ఆదేశిస్తుంది. కాగా ఆ సమయంలోనే పరమేశ్వురుడు తన తపస్సును ముగించుకుని తిరిగి ఇంటికి వస్తాడు. అయితే అక్కడే ఉన్న వినాయకుడు పరమేశ్వరుడిని లోపలికి రానీయకుండా అడ్డుకుంటాడు. అయితే పార్వతీ దేవి తన భార్య అని శిడుడు గణేషుడికి ఎంతో చెప్పి చూస్తాడు. కానీ ఆ బాలుడు తన మాట అస్సలు లెక్క చేయడు.
undefined
ఎంతచెప్పినా గణేషుడు వినకపోవడంతో శివుడికి పట్టరాని కోపం వస్తుంది. దీంతో తన త్రిశూలంతో గణేషుడి శిరస్సును ఛేదించి లోపలికి వెళ్తాడు. పార్వతీదేవికి నిజం తెలిసి కోపంతో భీకర రూపం ధరిస్తుంది. శివుడితో మీరు నా కుమారుడిని తిరిగి బతికించకపోతే భూమిని నాశనం చేస్తానని అంటుంది. శివుడు పార్వతీమాతకు నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అయినా ఒమే ఒప్పుకోదు. దేవతలు కూడా పార్వతీమాతకు ఎంతో చెప్పి చూస్తారు. అయినా ఆ తల్లి గణేషుడిని బతికించాలని పట్టు పడుతుంది. ఎంతో రోధిస్తుంది.
దీంతో పరమేశ్వరుడు శిశువు తలకు ఎదురుగా ఉన్న జీవి తలను తీసుకురామ్మని ఆదేశిస్తాడు. చాలాసేపు వెతికిన తర్వాత తన బిడ్డ వైపు పడుకున్న ఒక్క ఏనుగు మాత్రమే కనిపిస్తుంది. గరుడదేవుడు వెంటనే ఆ ఏనుగు తలను తీసుకుని శివుడికి ఇస్తాడు. శివుడు ఆ శిరస్సును వినాయకునిపై ఉంచి జీవం పోస్తాడు. అలాగే ఈ రోజు నుంచి ఎక్కడ ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తారని వరం ఇస్తాడు. గణపతికి పూజ చేయడం వల్ల ప్రజలు ప్రతి పనిలో విజయం సాధిస్తారని విష్ణుమూర్తి విశ్వసిస్తాడు. అందుకే ఆ రోజునే వినాయకుడినికి మంగళ మూర్తి అనే బిరుదును కూడా ఇస్తాడు. అందుకే మనం ఏ పని చేసినా ముందుగా వినాయకుడినే పూజించాలి. లేదంటే మన పనులు పూర్తి కావు. ఏదో ఒక ఆటంకం కలుగుతుంది.