narak chaturdashi 2023: ఛోటీ దీపావళినే నరక చతుర్దశి అని కూడా అంటారు. కాగా ఈ రోజు అభ్యంగన స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నరక చతుర్దశి, దీపావళి నాడు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేస్తుంటారు. ఎందుకో తెలుసా?
narak chaturdashi 2023: ప్రతి ఏడాది కార్తీక మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి నాడు నరక చతుర్దశిని జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం.. సూర్యోదయానికి ముందు చతుర్దశి తిథి, సూర్యాస్తమయం తర్వాత అమావాస్య తిథి వచ్చినప్పుడు ఒకే రోజు నరక చతుర్దశి, లక్ష్మీపూజను చేస్తారు. ఈ ఏడాది నరక చతుర్దశిని నవంబర్ 11న అంటే ఈ రోజునే వచ్చింది.
అభ్యంగన స్నానం ప్రాముఖ్యత
undefined
నరక చతుర్దశి యమరాజుకు అంకితం చేయబడిందిగా భావిస్తారు. కాగా ఈ రోజు అభ్యంగన స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజు అభయ స్నానం చేసే వ్యక్తులు నరకానికి వెళ్లరని నమ్ముతారు. ఈ అభ్యంగన స్నానం మతపరంగా ముఖ్యమైంది మాత్రమే కాదు.. ఇది మన శరీరానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
అభ్యంగన స్నానం శుభముహూర్తం
కార్తీక మాసంలో చతుర్దశి తిథి నవంబర్ 11న అంటే ఈ రోజు మధ్యాహ్నం 01:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది రేపు మధ్యాహ్నం 02:44 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. అభ్యంగన స్నానానికి శుభ ముహూర్తం నవంబర్ 12 న ఉదయం 05.28 నుంచి 06.41 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజు చంద్రుడు ఉదయం 05:28 గంటలకే ఉదయిస్తాడు.
అభంగన స్నాన పద్ధతి
నరక చతుర్దశి రోజున లేదా దీపావళి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసి కాసేపు మెడిటేషన్ పొజిషన్ లో కూర్చోవాలి. తర్వాత పసుపు, గంధం పొడి, నువ్వుల పొడి, పెరుగుతో తయారుచేసిన మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేయాలి. దీన్ని శరీరంపై బాగా రుద్దిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.