దీపావళి పండగకు ముందు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే..!

By telugu news team  |  First Published Nov 2, 2023, 4:41 PM IST

ఏవైనా మొక్కలు ఎండిపోతే.. వాటిని తొలగించి.. వాటి స్థానంలో ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలను ఉంచాలి. ముఖ్యంగా ఇంటికి నైరుతి సమీపంలో.. మొక్కలు ఉంచడం చాలా అవసరం.


దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ రోజున చాలా మంది  లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల, ఇంట్లోకి లక్ష్మీ దేవి ఇంట అడుగుపెడుతుంది అని నమ్ముతుంటారు. ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడేది డబ్బు కోసమే. అలాంటప్పుడు,   ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడతాను అంటే వద్దు అంటామా. అయితే.. అందుకు దీపావళి పండగ రోజు మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుందట. ముందుగా... ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  ఇళ్లు దుమ్ము, ధూలితో ఉండకుండా... శుభ్రపరుచుకోవాలి. అక్కడితో సరిపోదు.. మరికొన్ని పనులు చేయడం వల్ల ఈ దీపావళికి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట. అవేంటో ఓసారి చూద్దాం..


ఇంట్లో మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రవేశిస్తుంది. కాబట్టి దీపావళి రోజు కేవలం ఇల్లు శుభ్రం చేసుకోవడంతోపాటు... ఇంట్లోని అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైనా మొక్కలు ఎండిపోతే.. వాటిని తొలగించి.. వాటి స్థానంలో ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలను ఉంచాలి. ముఖ్యంగా ఇంటికి నైరుతి సమీపంలో.. మొక్కలు ఉంచడం చాలా అవసరం.

Latest Videos

undefined


ఇంట్లోని దుమ్ము, దూలిని తొలగించే సమయంలో... అవసరం లేనివి, పాత వస్తువుల, పాత దుస్తులను ముందుగా తొలగించాలి. మీరు రోజూ ధరించేవి.. పార్టీలకు వేసుకునేవి... ఇలా ముఖ్యమైనవి మాత్రమే ఉంచుకొని... పనికిరావు అనుకున్నవి తీసేయం.. లేదంటే ఎవరైనా లేనివారికి ఇవ్వడం చేయాలి. ఇంట్లో వస్తువులు గజిబిజీగా లేకుండా... ఎక్కడ ఉండాల్సిన వస్తువును అక్కడ ఉంచాలి.
 

ఇళ్లు శుభ్రం చేయడం అంటే.. ఇంట్లోని వార్డ్ రోబ్స్ కూడా శుభ్రం చేయడం అని తెలుసుకోవాలి. వార్డ్ రోబ్స్, కప్ బోర్డ్స్ ఇలా ప్రతి మూలను వదిలేయకుండా.. శుభ్రం చేయాలి.
 


ఇంట్లోని ఎండిపోయిన మొక్కలు, ఇంట్లోని పాత న్యూస్ పేపర్ల కట్టలు... అన్నీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి.... వాటిని ముందుగా తొలగించాయి. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను పెట్టడం, పేపర్ల కట్టలను తీసేయడం చేయాలి.
 

పండగ వేళ ఇంటిని శుభ్రం చేసేసమయంలో చాలా మంది... బాత్రూమ్స్, వాష్ రూమ్స్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి... వాటిని కూడా వదలకుండా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది.


అంతేకాకుండా.. ఇంట్లోని కర్టెన్స్, బెడ్ షూట్స్, బ్లాంకెట్స్ ని కూడా తొలగించి... వాటి స్థానంలో ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వాటిని ఉంచాలి. ఇవన్నీ శుభ్రం చేసుకుంటే... ఈ దీపావళి కి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కచ్చితంగా అడుగుపెడుతుంది.


 

click me!