టిడిపిపై ఉండవల్లి జోస్యం

Published : Oct 21, 2016, 09:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
టిడిపిపై ఉండవల్లి జోస్యం

సారాంశం

2018 బడ్జెట్ తర్వాత టిడిపి వికెట్లు పడతాయి

అధికార తెలుగుదేశం పార్టీ 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వికెట్లు పడటం మొదలవుతాయని  ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. టిడిపి అమలు చేస్తున్న నిర్ణయాలపై బహిరంగ చర్చకు సిద్దమని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి సవాలు విసిరారు. స్పీకర్ పై ప్రతిపక్ష వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిపుడు శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు ధ్వజమెత్తారు.

అసలు అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్ కోడెల తన స్దానంలో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలే అభిప్రాయ వేదికలుగా పేర్కొన్నారు. ఇన్ని చెప్పిన ఉండవల్లి, తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని చల్లగా చెప్పటం గమనార్హం.

PREV
click me!