
|
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అరిష్టాలు ఎదురు కాకుండా, టిఆర్ ఎస్ అధికారంలో పది కాలాల పాటు అవిఘ్నంగా నిశ్చింతగా కొనసాగేందుకు వాస్తు కంచుకోట లాగా సెక్రెటేరియట్ ను, క్యాంపు కార్యాలాయన్ని పకడ్బందీగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ నిర్మస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన పోచమ్మ గుడిని కూడా ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రగతి కోసం, శాంతికోసం యాగాలను కూడా నిర్వహించారు. ఇంకా చాలా యాగాలున్నాయి.వీటికి తోడు ఆయన ఫార్మ్ హౌస్ లో నుంచి రచిస్తున్న రాజకీయ వ్యూహాల సంగతి సరే సరి. భవిష్యత్తు సంగతేమో గాని, ఇప్పటికయితే ప్రతిపక్షాలను ’హాంపట్’ చేసే కార్యక్రమంలో కెసిఆర్ బిజిగా ఉన్నారు.
అయితే, టిఆర్ఎస్ ఎత్తులను చిత్తుచేసేదుకు ప్రతిపక్షాలు కూడా దూసేందుకు ఎన్ని రకాల కత్తులున్నాయో తెలంగాణా మొత్తం అంగుళం అంగుళం గాలిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను ఎలాగయినా ఓడించేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ శపథం చేశాయి. ఈ పార్టీలన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ వైఫల్యాలను జనంలోకి తీసుకుపోయేందుకు పూనుకున్నాయి. (ముఖ్యమంత్రి వైఫల్యాలు జనం కంటే పార్టీలకే ఎక్కువ తెలుసా).
2019 ఎన్నికలలో టిఆర్ఎస్ గద్దె దిగేదాకా ఇంటి కొచ్చేది లేదన్నట్లుగా ఈ పార్టీలన్నీ తెలంగాణా దేశాటన మొదలు పెట్టాయి. పాదయాత్రలు, ఘర్జనలు, చైతన్య యాత్రలు జోరందుకున్నాయి. మొత్తానికి కెసిఆర్ వ్యూహమేమిటో గాని, ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా హైదరాబాద్ లో నిమ్మలంగా కూర్చోకుండా చేయడంలో విజయవంతమయ్యారు.
సాధారణంగా ఏడాదికొకసారి భూపోరాటాలను టైంటేబుల్ ప్రకారం చేసే సిపిఎం ఈ సారి నెలల తరబడి సాగే మహాజన యాత్రను ప్రారభించింది. కాంగ్రెస్ చాలా కాలంగా చేస్తున్న ఉద్యమాలను ఉధృతం చేసింది. ఇపుడు బిజెపి కూడా మూడునెలల ఉద్యమానికి సన్నధ్ధమవుతూ ఉంది. ఇక తెలుగుదేశం కూడా ఇదేయాత్ర ఉద్యమాన్ని రూపొందిస్తున్నదని చెబుతున్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయం, సమగ్రాభివృధ్ది కోసం అక్టోబర్ 17 నుంచి మహాజన పాద యాత్ర ప్రారంభించారు.వీరభద్రం కూడా ఈ యాత్రలో సాధారణ కమ్యూనిస్టు తరహ కఠోర ఉపన్యాసల జోలికి వెళ్ల కుండా కెసిఆర్ టెక్నిక్ను ప్రయోగిస్తున్నారు. రుణ మాఫీ అందని పేదు రైతు, పెన్షన్ అందరి వృద్ధురాలు, 2బిహెచ్ కె ఇల్లందని దళిత మహిళ, ఉద్యోగం రాని యువకుడు.... ఇలా రకరకాల ’ కెసిఆర్ బాధితులను’ కలుసుకుని కెసిఆర్ వైఫల్యాలను రుజువు చేసే ప్రయత్నంలో ఉన్నారు.
తెలంగాణా ఉద్యమ సమయంలో ఏ విధంగా తెలంగాణా బోర్లెండిపోయిన పేద బక్కరైతును చూపి ఆంధ్రోళ్ల దుమ్ము దుళిపేశాడో ఇపుడు మన కామ్రేడ్ కూడా అదే చేస్తున్నుడు. గురువారం నాడుఆయనొక పేదరైతును పరామర్శంచాడు. ఏ మన్నాడో చూడండి .
“మా పొలంల సోయా,ఉలవలేసినం సారో, గయన్నీ ఎండిపోయినయ్. తాగనీకి నీళ్లు లేవ్. గందుకనే పొలం తాన్కి కూడా ఇంటి కాన్నించే నీళ్లు దీస్కపోతన్న మరి. కెసిఆర్ సార్ వచ్చినంత మాకేం జేయలే. పది బోర్లేసినం. గవన్నీ ఎండిపోయినయ్. పన్లేదు. ఫూట గడవడమే కష్టమైతాంది. ఎం జెయ్యాలే సారూ, ఒక్కరికి డబుల్ బెడ్రూం రాలే. అంతా మాయజేస్తున్రు,” అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మంధన్ గౌరెల్లికి చెందిన సభావత్ హస్లీ అనే గిరిజన మహిళ తమ్మినేని ముందర గోడు ఎల్లబోసుకుంది. ఇది 2002 ప్రాంతంలో కెసిఆర్ ముందర రైతులు చెప్పిన మాటలను గుర్తుకు తెస్తుంది. ఈరైతులందరిరి పోరాడదాం రండి తమ్మినేతి పిలుపు నిచ్చారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తన పోరాటానికి ఢిల్లీ నేతలను కూడా ఆహ్వానించింది. గురువారం కాంగ్రెస్ నేతల పొలి కేకలతో దద్దరిల్లింది తెలంగాణా. ఒక వైపు నిజాం షుగర్స్ ను తెరవాలని సీనియర్ నాయకులు మహ్మద్ షబ్బీర్, మల్లుభట్టి విక్రమార్క, మధు యాష్కిగౌడ్, సుదర్శన్ రెడ్డి తదితరలు నిజాంబాద్ జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఇంకొక వైపు మహబూబాబాద్ లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు గర్జన జరిపారు. ఇపుడు గ్రామీణ జిల్లా స్థాయి ఉద్యమాలలో పాల్గొనని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా ఈ గర్జనకు గొంతు కలిపాడంటే, కెసిఆర్ వ్యూహాలు కాంగ్రెస్ ను ఎంత కలవరపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఈ సభలో జైపాల్ వెల్ల గక్కిక అక్కసు చూద్దాం. “టిఆర్ఎస్ రక్తంలోనే ద్రోహం ఉంది. కెసిఆర్ చేసిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోదు. ఎన్నికల ముందు రైతులకు ఎన్ని వాగ్దానాలు చేశాడో గుర్తుంది కదా. ఈ హామీ లన్నింటిని ఆయన విస్మరించాడు. ఇది టిఆర్ఎస్ రక్తంలో ద్రోహం, మోసం ఉన్నాయనేందుకు సాక్ష్యం. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం. ”
ఇపుడు తాజాగా బిజెపి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని చూస్తూ ఉంది. ఈ పార్టీ మూడు నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద , ముఖ్యంగా రైతుల కోసం, యాత్రా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రకటించారు. ’ వ్యవసాయ రంగంనిండా సమస్యలే. దళితుల, బిసిలకు న్యాయం జరగడం లేదు. విద్యార్థులకు పీజు రియంబర్స్ మెంట్ లేదు. అరోగ్యశ్రీ నిధులు లేవు. ఎస్ సి, ఎస్ టి నిధలను పక్కకు మళ్లిస్తున్నారు. 2బిహెచ్ కె ఇల్లు ఏమయ్యాయో తెలియదు. అందువల్ల వీటిని అమలు చేయాలని వత్తిడి తెచ్చేందుకే ఈ మూడు నెలల ఉద్యమం,’ అని లక్ష్మణ్ చెప్పారు. ఇక కార్యాచరణ ప్రకటించాల్సింది తెలుగుదేశమే.
Last account activity: 1 minute ago |