పెట్రో వర్సిటీకి శంకుస్ధాపన

Published : Oct 20, 2016, 12:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పెట్రో వర్సిటీకి శంకుస్ధాపన

సారాంశం

పెట్రోలియం వర్పిటీకి శంకుస్ధాపన హాజరైన కేంద్ర మంత్రులు

 విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం మండలం వంగలి గ్రామంలో పెట్రోలియం విశ్వవిద్యాలయంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు శంకుస్ధాపన చేసారు. గురువారం ఉదయం కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, ధర్మేంద్రప్రధాన్, సుజన చౌదరి, ఎంపి హరిబాబు సమక్షంలో చంద్రబాబు శంకుస్దాపన చేసారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, ఇప్పటి వరకూ విశాఖ జిల్లాకు పెట్రోలియం విశ్వవిద్యాలయం, నైపుణ్యాభివృద్ది కేంద్రం, మెరైన్ వర్సిటీ వచ్చినట్లు తెలిపారు. అంతే కాకుండి విశాఖకు 8 ఐటి సంస్ధలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. సబ్బవరంను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్నీ కళాశాలలకు ఉచిత వైఫై సదుపాయ కల్పిస్తామని ప్రకటించారు.

   అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ, విశాఖలోనే త్వరలో రూ. 35 వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కు శంకుస్ధాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాది కల్పించేందుకే నైపుణ్యాభివృద్ది కేంద్రం ఏర్పాటైనట్లు తెలిపారు. ఇదే సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, కేంద్రం సాయంతో ఏపి వెలుగుల ప్రదేశ్ గా మారిందన్నారు. ప్రతీ ఇంటికీ గ్యాస్ సిలిండర్లను అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ళల్లోనే రాష్ట్రంలో కీలకమైన విద్యా సంస్ధలను ఏర్పాటు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడికే దక్కుతుందని వెంకయ్యనాయడు తెలిపారు.

PREV
click me!