కెసిఆర్ మీద సినిమా

Published : Oct 20, 2016, 09:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
కెసిఆర్ మీద సినిమా

సారాంశం

 తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద సినిమా  రానుంది  మధురా శ్రీధర్ రెడ్డి   దర్శకుడు, 2017, జూన్ 2, షూటింగ్ మొదలు ఫిబ్రవరి17,  2018 న విడుదల

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీద తొందర్లో సినిమా రాబోతోంది. దర్శకుడు మధురా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో   ఈ చిత్రం రాబోతున్నట్లు   ప్రకటించారు.  తెలంగాణా  రెండోదశ ఉద్యమానికి రూపకల్పన చేసిన నాయకత్వం వహించి, అంతా రాదు అనుకున్నప్పుడు ప్రతేక రాష్ట్రాన్ని సాధించిన ఆయన రాజకీయ  జీవితం  తెరకెక్కనుంది.ఈచిత్ర  నిర్మాణం తెలంగాణా అవతరణ దినం 2017 జూన్ రెండో తేదీన మొదలవుతుంది. చిత్రాన్ని   కెసిఆర్ పుట్టిన రోజు  ఫిబ్రవరి 17, 2018 న విడుదల చేస్తారు. ధర్మపాద క్రియోషన్ మీద నిర్మాణం కానున్న ఈ  చిత్రానికి రాజ్ కందుకూరి నిర్మాత.

కెసిఆర్  రాజకీయ జీవితం మొదటి ఘట్టంలో పెద్దగా విశేషాలేమీ కనిపించవు. ఆయన అందరి లాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మంత్రి అయ్యారు. ఉపసభాపతి అయ్యారు. అయితే,  ఆ పార్టీలో  ఉన్నపుడు ఆయన వ్యక్తిత్వానికి చెందిన అనేక విషయాలు మరుగునే  ఉన్నాయి.  కెసిఆర్ నాయకత్వం, ఆయన రాజకీయదార్శనికత, సాహిత్యం మీద అయనకున్న మక్కువ, సునిశిత అవగాహన,  విశ్లేషణా శక్తి, ఎంత జటిలమయిన విషయాన్నయినా తెలంగాణా పరిభాషలో అందరికి అర్థమయ్యే లా చెప్పగల  వాక్చాతుర్యం  తెలంగాణా ఉద్యమాన్ని ప్రతి ఇంటిలోకి, ప్రతి మనిషి హృదయంలోకి తీసుకువెళ్లాయి. 

 

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో పాటు పేరు మోసిన ఆంధ్ర నాయకులంతా తెలంగాణా నువ్యతిరేకించినా,  ఆచప   నాయకత్వం తీరు తెలంగాణా ప్రజలంతా చెట్టపెట్టాలేసుకుని జెఎసిలు ఏర్పాటు చేసుకుని, నిర్బంధాలెదురయినా ప్రత్యేక రాష్ట్రం వచ్చే దాకా  పోరాడేలా చేసింది.

 

ఈ అరుదయిన విలక్షణమయిన గుణమే కెసిఆర్ మీద ఒక చిత్రం తీసేందుకు ప్రేరణ కల్గించిందని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు.ఇందులో  కెసిఆర్ నటిస్తారా, వూరికే అతిధిగా దర్శన మిస్తారా వివరాలు అందాల్సి ఉంది.కెసిఆర్ స్వతహాగ మంచి కవి. కాకపోతే, రాయని కవి. ఆయన ఉపన్యాసాలు వినేవాళ్లకి ఆయనలో దాక్కుని ఉన్న కవి కనిపిస్తూ ఉంటాడు.

అయితే, రెండు సినిమాలకు గేయాలందించారు.ఇందులో ఒకటి శంకర్ దర్శకత్వంలో వచ్చిన జైబోలో ’తెలంగాణా’. రెండో సినిమా ’కొలిమి’. ఇందులో ’గారడి చేస్తుండ్రు’ ఆయన కలం నుంచి జాలు వారిందే.

PREV
click me!