వైజాగ్ ప్రాజక్టు కీలక సమాచారం దాస్తున్న కేంద్రం

Published : Oct 20, 2016, 06:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
వైజాగ్ ప్రాజక్టు కీలక సమాచారం దాస్తున్న కేంద్రం

సారాంశం

కృష్ణ పట్నం  ఇంటర్నేషన్ లెదర్ కంప్లెక్స్ కీలక సమాచారం కేంద్రం దాస్తున్నది కేంద్ర పర్యావరణ శాఖ వెబ్ సైట్  ఈ ప్రాజక్టు పర్యావరణ నివేదిక లేదు ఈ శాఖ చర్య అనుమానాలకు తావిస్తున్నది

ప్రాజక్టులకు  పర్యావరణ అనుమతులించ్చేందుకు కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థల పనితీరు చాలా అనుమానాలకు తావిస్తున్నది. ఆ మధ్య  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎస్ఇఐఎఎ (స్టేట్ ఎన్నిరానెమెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అధారిటీ) అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంత అలవోకగా పర్యావరణ అనుమతినిచ్చిందో  వెల్లడయింది. ఈ అనుమతి కోసం ఈ సంస్థకు అందించే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ (ఇఐఎ) చాలా సందర్భాలలో ఇతర రిపోర్ట్ లకు కాపీ యే నని, పాత రిపోర్టుల నుంచి పేజీపేజీలకు మక్కీకి మక్కి కాపీ చేసి  రాస్తున్నట్లు రుజువులతో కూడా నిపుణులు నిరూపించారు. అందువల్ల  పర్యావరణ అనుమతి సర్టిపికెట్ ను  ప్రభుత్వాలు ఇంటర్నెట్లో పోస్ట్ చేసే ముందు ఇఐఎ రిపోర్ట్ ను విధిగా పోస్ట్ చేయాలి. అపుడు ప్రజలు, పర్యావరణ వేత్తలు ఈ నివేదికను చదివి, ప్రాజక్టు వల్ల పర్యావరణం ఏ మాత్రం దెబ్బ తింటుందనే విషయాన్ని క్షుణ్ణంగా అద్యయనం చేసిన తర్వాతే  ప్రభుత్వం పర్యావరణ అనుమతి నీయడం జరిగిందని తెలుసుకుంటారు. 

అయితే, ఇపుడు ప్రభుత్వాలు పర్యావరణ అనుమతినిఇస్తూ జారీ చేసిన సర్టిఫికెట్ను  మాత్రం డిపార్ట్ మెంట్  వెట్ సైట్లో  చూపించి కీలకమయిన ఇఐఎ రిపోర్టును దాచిపెడుతున్నాయి. దీని వల్ల పర్యావరణ అనుమతిని నిజాయితీగా అధ్యయనం తర్వాత ఇచ్చార,రాజకీయ కారణాలతో ఆషామాషిగా ఇచ్చారా అనే విషయం  తెలియకుండా పోతుంది.  ఇపుడు అంధ్రప్రదేశ్ పశ్చిమగోదారి జిల్లాలో తుందుర్రు గ్రామంలో ఆక్వాప్రాసెసింగ్  ప్రాజక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది.

స్థానిక పారిశ్రామకు వేత్తకు చెందిన  ప్లాంట్కు ప్రజాఅభిప్రాయం తెలుసుకోకుండా అనుమతినిచ్చారనేది అరోపణ. చాలాకాలుష్యానికి దారితీసే ఈ  ప్రాజ్టక్టును జనావాసాల మధ్య అందునా మంచినీటి వనరుల సమీపంలో పెట్టారని సిపిఎం నేత బిబలరాం ఆరోపిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా  ఈ గ్రామాన్ని సందర్శించి అక్కడ పోరాటం చేస్తున్న రైతులకు మద్ధతు తెలిపారు.తమకు అండగా ఉండండని రైతులు, మత్స్య కారులు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు.  ఈ  ప్రాజక్టు గురించి ఇంతవివాదం ఎందుకు నడుస్తున్నది? ప్రాజక్టుల ప్రభావం పర్యావరణమీద  ఎలా ఉంటున్నదనే అంశం మీద శాస్త్రీయంగా అధ్యయనం జరపకుండ రాజకీయ బంధుత్వం వల్ల నో వత్తిడి వల్లనో మరే ఇతర కారణంగానే  అనుమతి నీయడమే. అందుకే ప్రభుత్వాలు తప్పనిసరిగా పర్యవరణ ప్రభావం మీద జరిపిన అధ్యయన నివేదికను వెబ్ సైట్లో విధిగా పోస్టు చేయాలి.

 

“వెబ్ సైట్లో కేవలం పర్యావరణ అనుమతి (ఇసి)పత్రం  మాత్రం పొందుపర్చడం, దీనికి ఆధారమయిన  ఇఐఎ రిపోర్టను అందుబాటులో వుంచకపోవడం  వింతగా ఉంది. ఇదేదో పొరపాటున జరిగిందనుకోవడానికి వీల్లేదు. ఈ శాఖ అధికారులు ఏదో దుర్బుద్ధితో, ప్రజలకు ఇఐఎ నివేదికలోని కీలక సమాచారం అందకుండా చేసేందుకు ఇలా చేశారని అనిపిస్తున్నది.నా దృష్టిలో ఇది అవినీతి కిందకు వస్తుంది. దీనికి కారణమయిన అధికారులను అవినీతి నిరోధక చట్టంకింద చర్యలు తీసుకోవాల్సిందే,”

 అయితే, కేంద్ర ప్రభుత్వం  ఈ విషయాన్ని తొక్కిపెట్టి నివేదిక ప్రజలకు తెలియకుండా దాచిపేడుతున్న సంఘటన బయటపడింది. ఇది జరిగింది కేంద్ర పర్యావరణ   అటవీ వాతావర ణశాఖ పరిధిలో.

విశాఖ పట్టణంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా పట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ ప్రాజక్టుకు పర్యావరణ అనుమతి వచ్చింది.ఈ డాక్యుమెంట్ ని కేంద్ర పర్యావరణ శాఖ (ఎంఇఎఫ్ సిసి) వైట్ సైట్లో  అందుబాటులోఉంచారు. అయితే, ఇది చాలదు. ఈ అనుమతినిచ్చేందుకు అదారమయిన పర్యావరణ  ప్రభావ అధ్యయన నివేదిక కూడా  వెట్ సైట్ ఉంచాలి.  కేంద్ర అటవీ శాఖ  ఈ పని చేయలేదు. ఈ విషయం ఎలా మర్చిపోయారు?

ఇప్పటికే  ఈ ప్రాజక్టు కు   ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.  దీనికి వ్యతిరేకంగా చాలా ఉద్య మాలు కూడా నడిచాయి. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం లాఠీ చార్జ్ దాకా వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలో  కీలక సమాచారం దాచడం ఇది సబబు కాదని, వెంటనే  ఇఐఎ నివేదికను వెబ్ సైట్ టో పోస్టు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి  ఎ.ఎన్ ఝా కి కేంద్ర మాజీ ఇంధన శాఖ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ఒక లేఖ రాశారు. వెబ్ సైట్ శ్నాఫ్ షాట్ ను కూడా ఆయన కేంద్ర కార్యదర్శికి పంపించారు.

“వెబ్ సైట్లో కేవలం పర్యావరణ అనుమతి (ఇసి)పత్రం  మాత్రం పొందుపర్చడం, దీనికి ఆధారమయిన  ఇఐఎ రిపోర్టను అందుబాటులో వుంచకపోవడం  వింతగా ఉంది. ఇదేదో పొరపాటున జరిగిందనుకోవడానికి వీల్లేదు. ఈ శాఖ అధికారులు ఏదో దుర్బుద్ధితో, ప్రజలకు ఇఐఎ నివేదికలోని కీలక సమాచారం అందకుండా చేసేందుకు ఇలా చేశారని అనిపిస్తున్నది.నా దృష్టిలో ఇది అవినీతి కిందకు వస్తుంది. దీనికి కారణమయిన అధికారులను అవినీతి నిరోధక చట్టంకింద చర్యలు తీసుకోవాల్సిందే,”అని ఇఎఎస్ శర్మ ఈ లేఖలోపేర్కొన్నారు.

వెంటనే ఇఐఎ నివేదిక అప్ లోడ్ చేసి ,  ఈ తప్పిదానికి కారణమయిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర కార్యదర్శికి సూచించారు.

 

PREV
click me!