మళ్లీ అదే ప్రత్యర్ధి చేతుల్లో... జపాన్ ఓపెన్‌లోనూ పీవీ సింధు ఓటమి

Siva Kodati |  
Published : Jul 26, 2019, 02:01 PM IST
మళ్లీ అదే ప్రత్యర్ధి చేతుల్లో... జపాన్ ఓపెన్‌లోనూ పీవీ సింధు ఓటమి

సారాంశం

ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ ఫైనల్‌ ఓటమిని మరచిపోకముందే భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు మరోసారి అదే ప్రత్యర్ధి చేతుల్లో ఓటమి పాలయ్యారు. జపాన్ ఓపెన్‌ క్వార్టర్స్ ఫైనల్లో ఆమె పరాజయం పాలయ్యారు.

ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ ఫైనల్‌ ఓటమిని మరచిపోకముందే భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు మరోసారి అదే ప్రత్యర్ధి చేతుల్లో ఓటమి పాలయ్యారు. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్-750 టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణి యామగుచి చేతిలో ఓటమిపాలయ్యారు.

తొలి గేమ్ ప్రారంభంలో సింధు ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. రాను రాను ఒత్తిడికి గురికావడంతో సింధు వరుసగా పాయింట్లు కోల్పోయింది.  దీంతో 18-21, 15-21 తేడాతో ఓటమిపాలైంది.

మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో మరో తెలుగుతేజం సాయిప్రణీత్ అదరగొట్టాడు. ఇండినేషియా ఆటగాడు టామి సుగియార్తో‌పై 21-22, 21-15 తేడాతో సునాయాసంగా విజయం సాధించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. 

PREV
click me!

Recommended Stories

Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?