ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో సింధు ఓటమి

Siva Kodati |  
Published : Jul 21, 2019, 02:55 PM ISTUpdated : Jul 21, 2019, 03:58 PM IST
ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో సింధు ఓటమి

సారాంశం

ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో తెలుగు తేజం పీవీసింధు పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచి చేతితో 15-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది.

ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 19-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలయ్యింది.

క్వార్టర్స్, సెమీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ఫైనల్లో తన మ్యాజిక్ చూపించలేకపోయింది. తొలి సెట్లో గట్టిపోటినిచ్చినప్పటికీ.. తర్వాత యమగూచి ధాటికి సింధు తలవంచక తప్పలేదు. అయితే గతంలో యమగూచిపై సింధుకి మెరుగైన రికార్డు ఉంది. 

PREV
click me!

Recommended Stories

కబడ్డీ వరల్డ్ కప్‌ ఛాంపియన్ గా టీమిండియా.. దుమ్మురేపుతున్న భారత మహిళలు
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గెలిచిన లక్ష్య సేన్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?