ప్రో కబడ్డి 2019: స్టార్ రైడర్ నవీన్ వన్ మ్యాన్ షో... డిల్లీ చేతిలో యూపీ ఓటమి

Published : Aug 25, 2019, 10:01 PM ISTUpdated : Aug 25, 2019, 10:08 PM IST
ప్రో కబడ్డి 2019: స్టార్ రైడర్ నవీన్ వన్ మ్యాన్ షో... డిల్లీ చేతిలో యూపీ ఓటమి

సారాంశం

డిల్లీలోని త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో స్ధానిక జట్టు అదరగొట్టింది. యూపీ యోదాస్ తో తలపడ్డ డిల్లీ దబాంగ్స్ 9 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.  

సొంత ప్రేక్షకుల  మధ్య హోం గ్రౌండ్ లో జరిగిన ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో దబాంగ్ డిల్లీ మరోసారి అదరగొట్టింది. డిల్లీలోని త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యూపీ యోదాస్ తో తలపడ్డ దబాంగ్ జట్టు 9 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో డిల్లీ రైడర్ నవీన్ కుమార్ వన్ మ్యాన్ షో సాగించాడు. అతడొక్కడే ఏకంగా 16 పాయింట్లు సాధించి జట్టును విజయతీరానికి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. 

రైడర్ నవీన్ కుమార్ చెలరేగడంతో డిల్లీ  రైడింగ్ లో 20 పాయింట్లు సాధించింది. ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 2 ఇలా మొత్తం 36 పాయింట్లు సాధించింది.  ఆటగాళ్లలో నవీన్ ఒక్కడే 16 పాయింట్లతో అదరగొట్టాడు. డిఫెండర్స్ లో నవీన్ పహాల్ 5 పాయింట్లతో పరవాలేదనిపించాడు. 

యూపీ యోదాస్ రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 9  మొత్తంగా 27 పాయింట్లు సాధిచింది. ఆటగాళ్లలో మోను 10, రిశాంక్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అయినప్పటికి ఆతిథ్య డిల్లీపై యూపీ 36-27 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. 
 

PREV
click me!

Recommended Stories

Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?