ఎన్ బిఏ లెజెండ్ కోబే బ్రియాంత్ హెెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. కాలిఫోర్నియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 9 మంది మరణించారు. వారిలో బ్రియాంత్ తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు కూడా ఉంది.
కాలిఫోర్నియా: బాస్కెట్ బాల్ దిగ్దజం కోబె బ్రియాంత్ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మరణించాడు. ఆదివారంనాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించాడు. హెలికాప్టర్ కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు.
కోబె బ్రియాంత్ ఎన్ బీఏ చాంపియన్ షిప్ ను ఐదు సార్లు గెలిచాడు. కాలిఫోర్నియాలోని కాలాబసాస్ కొండల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. బ్రియాంత్ వయస్సు 41 ఏళ్లు. మృతుల్లో బ్రియాంత్ 13 ఏళ్ల కూతురు గియానా కూడా ఉంది.
undefined
ఎన్ బీఏ కుటుంబం కుప్పకూలిందని ఎన్ బీఏ కమిషర్ ఆడమ్ సిల్వర్ చెప్పారు. లాస్ ఏంజెలెస్ లో అతని ఎప్పటికీ జీవించే ఉంటాడని, తమ కాలానికి చెందిన హీరోల్లో బ్రియాంత్ ఒక్కరని లాస్ ఎంజెలెస్ మేయర్ ఎరిక్ గార్సెట్టి అన్నారు.
బ్రియాంత్ ఎన్ బీఏలో 1996లో చేరారు. పాఠశాల విద్య ముగించిన వెంటనే ఆయన అందులో చేరారు. లీగ్ అతనే అప్పుడు అతి పిన్న వయస్కుడు. లేకర్స్ పై అతని మరణం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Nine people died in the helicopter crash in which NBA legend Kobe Bryant was killed, reports AFP news agency quoting police officials. (File pic) pic.twitter.com/uBHGO0OTR0
— ANI (@ANI)