కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ పార్టీ విలీనం పక్కా!.. షర్మిల పోటీ చేసేది ఇక్కడి నుంచే..!!

By Asianet News  |  First Published Jul 25, 2023, 5:55 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఎటువైపు అనేదానిపై కొంతకాలంగా చర్చ సాగుతున్న సంగతి  తెలిసిందే. అయితే  ఆమె కాంగ్రెస్‌తో జత కట్టడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.


వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఎటువైపు అనేదానిపై కొంతకాలంగా చర్చ సాగుతున్న సంగతి  తెలిసిందే. అయితే  ఆమె కాంగ్రెస్‌తో జత కట్టడం దాదాపు ఖాయమైందని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. షర్మిల స్పందిస్తున్న తీరు కూడా ఈ వార్తలు కూడా ఆ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని.. కొన్ని అంశాలపై క్లారిటీ కోసం వేచిచూస్తున్నారని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌ పార్టీలో చేరి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని షర్మిల భావిస్తుండగా.. అయితే  కొందరు నాయకులు మాత్రం ఈ పరిణామాలను వ్యతిరేకిస్తున్నట్టుగా  తెలుస్తోంది. ఇలాంటి పలు కారణాలతోనే కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియ ఆలస్యం అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నారు. అయితే అటు కాంగ్రెస్ అధిష్టానం.. ఇటు షర్మిల కూడా విలీన ప్రక్రియగా  సుముఖంగా ఉన్నారని చెబుతున్నాయి. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ఈ డీల్ సెట్ చేసేందుకు తీవ్రంగా  కృషి చేస్తున్నారని.. కాస్తా ఆలస్యమైనప్పటికీ ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 

Latest Videos

undefined

అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్‌తో జట్టుకట్టిన పక్షంలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే  పోటీ చేసే స్థానాల విషయంలో రెండు  నియోజకవర్గాల పేర్లు ప్రధానంగా  వినిపిస్తున్నాయి. అందులో ఒకటి పాలేరు కాగా.. మరొకటి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. షర్మిల వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేసినప్పటీ.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్‌లపై ఫోకస్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో పాలేరు పాదయాత్ర చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. అక్కడ పార్టీ  కార్యాలయం నిర్మాణం కూడా చేపట్టారు. 

అయితే షర్మిల పాలేరులో నుంచి పోటీ చేసిన పక్షంలో ఆమెకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం.. పాలేరు బీఆర్ఎస్‌లో తుమ్మల నాగేశ్వరరావు  వర్సెస్ కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితులు.. అక్కడ స్థానికంగా ఆంధ్ర మూలాలు ఎక్కువ మంది ఉండటం.. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు.. వంటి అంశాలు షర్మిలకు కలిసివచ్చే అవకాశం ఉంది. 

అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా పాలేరు నుంచి వీలుకాకపోతే.. షర్మిలను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ నేత పద్మరావు గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు అధికంగా ఉన్నాయి. 2009లో ఇక్కడి  నుంచి కాంగ్రెస్ చివరిసారిగా గెలుపొందింది. ఆ ఎన్నిక్లలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సినీ  నటి జయసుధ విజయం సాధించారు. అయితే షర్మిలను సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిపిన పక్షంలో క్రిస్టియన్ ఓట్లు గంపగుత్తగా షర్మిలకు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైఎస్ షర్మిలను అర్బన్ ప్రాంతం (సికింద్రాబాద్) కంటే రూరల్ ప్రాంతం (పాలేరు) నుంచి పోటీ చేయిస్తేనే మంచి ఫలితం ఉంటుందని మెజారిటీ అభిప్రాయంగా చెబుతున్నారు. 
 

click me!