సామ్రాజ్యాల స్మశానం అనే పేరును ఆఫ్గనిస్తాన్ నిలబెట్టుకుంటుందని పేర్కొంటూ అమెరికన్ బలగాలు అక్కడ విఫలం చెందడానికి కారణాలను వివరించారు అతా హస్నైన్
ఆఫ్గనిస్తాన్ నుండి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లడాన్ని మనం గమనిస్తే గతంలో అమెరికా ఇతర దేశాల నుండి బయటకు వెళ్లేప్పుడు చోటుచేసుకున్న పరిస్థితులు మనకు తిరిగి కనబడతాయి. గతంలో వియత్నాం నుండి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లేప్పుడు "లాస్ట్ హెలికాప్టర్" అనే పదం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిన విషయమే..! సైగాన్ లోని అమెరికా ఎంబసీ మీది నుంచి హెలికాప్టర్ ఎగరడం వల్ల ఆ సంఘటన ఆధారంగా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సైగాన్ నుంచి ఎన్ని హెలికాప్టర్ లు వెనెక్కి వెళ్ళేటప్పుడు ఎగిరాయంటే... వాటిని తమ విమానవాహక నౌకల మీద పెట్టడానికి స్థలం సరిపోక సముద్రంలో వదిలేసేంత..!
బహుశా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొద్దనేమో బాగ్రామ్ ఎయిర్ బేస్ ని అమెరికా ఆగస్టు 31(అమెరికా బలగాలు ఆఫ్గనిస్తాన్ ని వదిలి వెళ్ళడానికి ఆఖరు తేదీ) కన్నా ముందే ఖాళీ చేసింది. అమెరికా మిలిటరీ చరిత్రలో హెలికాప్టర్లు రుణాత్మకమైన ప్రతీకలుగానే మనకు కనబడతాయి. ఆపరేషన్ ఈగల్ క్లా, ఆపరేషన్ బ్లాక్ హాక్ డౌన్ వంటి ఆపరేషన్లలో హెలీకాఫ్టర్లనే వినియోగించారు.
undefined
ఆఫ్గనిస్తాన్ నుండి సోవియెట్ బలగాలు వెనక్కి వెళ్లిపోవడం వల్ల అప్పటివరకు కొనసాగుతూ వచ్చిన ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. ఆ మాటకొస్తే 1980 దశకంలో అమెరికా వియత్నాంలో సాగించిన పోరాటం అయినా, సోవియెట్ రష్యా ఆఫ్గనిస్తాన్ లో సాగించిన యుద్ధం అయినా... కన్వెన్షనల్ పద్దతిలో జరిగాయి. ఎవరితో పోరాడుతున్నారు అనేందుకు ఒక క్లారిటీ వారికి ఉంది. కానీ 2001 నుండి అమెరికా దాని మిత్ర దేశాలు ఎక్కువగా నాన్ స్టేట్ యాక్టర్స్ తో యుద్ధాన్ని చేసేయి. ఏది ఏమైనా ఆఫ్గనిస్తాన్ మాత్రం మరోసారి సామ్రాజ్యాల స్మశానం అనే తన పేరును నిలబెట్టుకుంది.
బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు "కల్లోల దేశంలా మరోసారి మారకుండా బలమైన,స్థిరమైన,సమర్థవంతమైన పాలనలో ఆఫ్గనిస్తాన్ ని ఉంచుతాం" అనేది వారి లక్ష్య. కానీ ఒబామా కలం నాటికి దాని స్థాయి కాస్తా... అక్కడ ఎటువంటి తీవ్రఅవధా కార్యకలాపాలకు చోటు లేకుండా చేస్తాం గా మారింది. ఇద్దరు అధ్యక్షుల కాలంలో వారి లక్ష్యాల్లో వ్యత్యాసం ఉన్నప్పటికీ... అక్కడ తీవ్రవాదాన్ని అంతం చేయడమనేది మాత్రం వారి లక్ష్యంగా కనబడుతుంది. తీవ్రవాదాన్ని అంతం చేయడం ద్వారా ప్రపంచానికి నష్టం వాటిల్లకుండా... ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలకు నష్టం కలగకుండా చూడడం అనేది వారి లక్ష్యం అనేది సుస్పష్టం.
టూకీగా... అమెరికా పై 9/11 దాడులకు కారణమైన వారిని అంతమొందించి, ఉగ్రవాద సైద్ధాంతికతను అంతం చేసి, వారి పైన మిలిటరీ ఆధిపత్యం సంపాదించి చుట్టూ ఉన్నప్రాంతాల సహకారం ద్వారా పరిస్థితులు పునరావృతం కాకుండా చూడడం దీని లక్ష్యం. కానీ ఆఫ్గనిస్తాన్ లో అమెరికా ఈ లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్.
ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లాం అనేదే పాకిస్తాన్ అండదండలతో ఆఫ్గనిస్తాన్ నుండి సోవియెట్ బలగాలను తరమడానికి ఇస్లామిక్ యూనిటీ అనే భావజాలంతో ముందుకు వచ్చింది. దానికి సౌదీ అరేబియా ఆర్ధిక వనరులను అందించగా పోరాడటానికి అవసరమైన ఆయుధాలను అమెరికా సరఫరా చేసింది. ఇదే మేథాపారామైన భావజాలంతో ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లాంతో పాకిస్తాన్ కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది. ఒక వేళా గనుక ఆఫ్గనిస్తాన్ లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి అమెరికాకు సహకరిస్తే... ఆఫ్గనిస్తాన్ లో భారత్ ఛాయను కూడా చెరిపేయడానికి చేసిన ప్రయత్నం, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా సాధించిన కొద్దిపాటి లాభాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయనే భయంతో పాకిస్తాన్ ఇందుకు ఎంతమాత్రమూ సహకరించడంలేదు.
మొత్తానికి మొత్తంగా తాలిబన్ నాయకత్వం ఆల్ఖైదా లాగా వచ్చి పాకిస్థాన్లోని తలదాచుకున్నారు. అమెరికా సైన్యం ఆఫ్గనిస్తాన్ నుండి వెనక్కి తరలివెళ్లడానికి ప్రధాన కారణం వారి సామజిక పరిస్థితులు. సైనికుల మరణాలు చాలా చాల తక్కువైనప్పటికీ (సైనికుల మరణాలు ఉండాలన్నది కాదు ఇక్కడ నా ఉద్దేశం, కానీ యుద్ధం జరిగేటప్పుడు ఏమైనా జరగొచ్చు)... ఇప్పటివరకు సైనికులను అక్కడ ఉంచి సాధించిందేమిటనే ప్రశ్నకు అక్కడి రాజకీయ నాయకత్వం ప్రజలను ఒప్పించే సమాధానం చెప్పడానికి ధైర్యం చేయడంలేదు.
అమెరికా ఆఫ్గనిస్తాన్ నేషనల్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చింది. భారత్ సైతం అందులో తన వంతు పాత్రను పోషించింది. కానీ కొన్ని సంవత్సరాల్లోనే పూర్తిగా ఒక అత్యున్నతమైన జాతీయ అథిమిని తయారుచేస్తామంటే అది జరిగే పని కాదు. ధైర్యసాహసాల్లో వారు తక్కువ కాదు... కానీ అథిమిలోని నాయకత్వ బాధ్యతల్లో ఉండే ఆఫీసర్లు సరైన అనుభవం లేకపోవడం వల్ల ఒక మిషన్ ని వారు లీడ్ చేస్తారా అనే అనుమానం కలుగక మానదు. అంతే కాకుండా సైన్యానికి పూర్తి స్థాయి ఆయుధ సంపత్తిని ఇవ్వడానికి కూడా సంకోచించాల్సిన పరిస్థితి. చివరకు ఈ ఆయుధాలు కూడా తాలిబన్ల చేతికే వెళితే అనే ప్రశ్న ఉత్పన్నమైతే ఆయుధాలను పూర్తిస్థాయిలో అందించడానికి కూడా సంకోచించే పరిస్థితి.
అమెరికా వెళ్లిపోయేటప్పుడు పాకిస్తాన్ నుంచి డ్రోన్లను ఎగురవేస్తూ ఆఫ్గనిస్తాన్ నేషనల్ ఆర్మీకి సహకరించడానికి పాకిస్తాన్ లో ఎయిర్ బేస్ ని అమెరికా డిమాండ్ చేసింది. అందుకు సంబంధించిన ఒప్పందం ఇంకా అయితే జరగలేదు.
అమెరికా ఆఫ్గనిస్తాన్ లో అడుగుపెట్టిన కొద్దీ కాలంలోనే తాలిబన్లు అమెరికా ముఖ్య లక్ష్యం పగ తీర్చుకోవడం అనే విషయాన్నీ గ్రహించారు. దానికి తోడు ఆఫ్గనిస్తాన్ లోని భౌగోళిక పరిస్థితులు వారికి సవాలుగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్గనిస్తాన్ నెల మీద నుంచి పాశ్చాత్య దేశాలపై ఉగ్రవాద దాడులు జరగకపోవచ్చు, కానీ పరిసర ప్రాంతాలపై ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘన్ నేలను ఉపయోగించారు అని మాత్రం చెప్పలేము.
ఆఫ్గనిస్తాన్ నుండి అమెరికా దూరమవ్వాలనుకుంటున్న వేళ చైనా, రష్యాల ప్రభావం ఇక ఆఫ్గనిస్తాన్ పై ఎక్కువ కాబోతుంది. మరో పక్క ఇరాన్, పాకిస్తాన్ లకు వారి వారి అవసరాలు ఉన్నాయి. మరోపక్క ఇండియా. ఆఫ్గనిస్తాన్ ను కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి తాలిబన్లు ప్రయత్నిస్తుంటే... మరోపక్క పట్టు కోల్పోకుండా ఆఫ్గనిస్తాన్ నేషనల్ ఆర్మీ పోరాడుతుంది. చూడాలి పరిస్థితులు ఎలా మారతాయి...!
- అతా హస్నైన్
రచయిత లెఫ్టనెంట్ జనరల్ (రిటైర్డ్) అతా హస్నైన్ శ్రీనగర్ కేంద్రంగా పనిచేసిన 15 కో కమాండర్ గా పనిచేసారు. ప్రస్తుతం కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ కి ఛాన్సలర్ గా కొనసాగుతున్నారు.