సామాన్యుడితో పాటు పవన్ అభిమానుల మనసులో మాత్రం అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఎన్నికలు కూడా దరిదాపుల్లో లేనప్పుడు పవన్ ఇలా ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దాని నుండి మొదలుకొని బీజేపీతోనే ఎందుకు అనే ప్రశ్న వరకు అనేక సందేహాలు, ఎన్నో సంశయాలు.
ఎన్నో రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ... యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ బీజేపీతో జనసేన పొత్తును అధికారికంగా మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు.
దీనికి ఒక రెండు నెల్ల ముందు నుండే, దేశానికి అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి నాయకులే అవసరం అని అన్నప్పుడు మొదలైన సందేహం,,,, తాను బీజేపీకి ఎప్పుడు దూరమయ్యానన్న మాటతో ఆ అనుమానం మరింత బలపడింది. మొన్నటి పవన్ ఢిల్లీ పర్యటన అన్ని అనుమానాలకు తెరదించుతూ... బీజేపీతో అనుబంధాన్ని కొనసాగించనున్నట్టు తెలిపాడు.
undefined
ఇప్పుడు ఏకంగా నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారికంగా ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్యను వివరించారు పవన్. పవన్ తో పాటు బీజేపీ నేతలంతా ఒకరిపై ఒకరు ప్రశంసలను కురిపించుకుంటూ, అధికార వైసీపీని, ప్రతిపక్ష టీడీపీని తీవ్రస్థాయిలో విమర్శించాయి.
Also read; బీహార్ ఫార్ములా: ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్
సామాన్యుడితో పాటు పవన్ అభిమానుల మనసులో మాత్రం అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఎన్నికలు కూడా దరిదాపుల్లో లేనప్పుడు పవన్ ఇలా ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దాని నుండి మొదలుకొని బీజేపీతోనే ఎందుకు అనే ప్రశ్న వరకు అనేక సందేహాలు, ఎన్నో సంశయాలు.
ముఖ్యంగా అందరిని తలచివేస్తున్న ప్రశ్న ఎందుకు బీజేపీ తో పవన్ దోస్తీ చేస్తున్నారు? సంస్థాగతంగా నిర్మాణం కూడా లేని బీజేపీతో అస్సలు సంస్థాగత నిర్మాణం లేని జనసేన కలిస్తే లాభమేముంటుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ కలిసాడు అనేది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న.
బీజేపీకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనీస ఆదరణ కూడా కరువయ్యింది. 2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కచోట కూడా డిపాజట్లు దక్కించుకోలేకపోయారు. వారికి ఇప్పుడు పార్టీకి ముఖచిత్రంగా ప్రొజెక్ట్ చేసేందుకు, ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ అవసరం.
అంతేకాకుండా 2019 ఘోరమైన పరాజయం తరువాత బీజేపీవైపు కన్నెత్తి కూడా వేరే పార్టీ పొత్తు పెట్టుకోవడానికి చూడడం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి నేత ఆసక్తి చూపెడితే వారు ఊరుకుంటారా. గద్దల్లా వాలిపోతారు. ఈ అవసరాల వల్ల పవన్ కళ్యాణ్ ను అక్కున చేర్చుకోవడానికి, ఇంకా ఓపెన్ గా గనుక మాట్లాడితే...పవన్ కళ్యాణ్ కి జూనియర్ పార్టనర్ గా నడిచేందుకు సైతం బీజేపీ ఒప్పుకుంది.
ఇక అసలు ప్రశ్న పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నాడు. రాజధాని అంశం అయితే... ఏ టీడీపీతోనో పెట్టుకోవచ్చు, లేదా జేఏసీ ఏర్పాటు చేసి అందులో కీలకంగా వ్యవహరించవచ్చు. కానీ అలా కాకుండా ఎందుకు పవన్ ఇలా బీజేపీతో కలిశాడనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.
దీనికి మనకు సమాధానం కావాలంటే... ఎన్నికలయినప్పటినుండి వైసీపీ నేతల జోరు పెరిగింది. అధికార వైసీపీ బ్యాటింగ్ ను ప్రతిపక్షాలు తట్టుకొని నిలబడేలా కనబడడం లేదు. టీడీపీ లాంటి పార్టీలకంటే సంస్థాగత నిర్మాణం ఉంది కాబట్టి వారి క్యాడర్ అంతా తోడుగా ఉంటారు పార్టీని కాపాడుకోగలుగుతారు.
కానీ జనసేన పరిస్థితి అది కాదు. వారికి సంస్థాగత నిర్మాణం లేదు. పవన్ ఇసుక దీక్షకు జనాలు తరలివచ్చారంటే...వారిని గ్రామస్థాయిలో క్యాడర్ కూడకట్టలేదు. పవన్ మీద అభిమానంతో అంతమంది జనం తరలి వచ్చారు.
Also read: పవన్ కళ్యాణ్ తో బీజేపీ దోస్తీ... పురంధేశ్వరి జాక్ పాట్
ఈ నేపథ్యంలో అధికార వైసీపీని తట్టుకోవాలంటే జనసేనకు ఒక అండ అవసరం. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం, దానిపైన పవన్ నేనేమి కామెంట్ చేయను అనడం అన్ని చూస్తుంటే పవన్ కి ఒక ఆలంబన అవసరం మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
బీజేపీతో గనుక పొత్తు పెట్టుకుంటే తనకు కావలిసిన తోడు దొరుకుతుంది. ఒకింత వైసీపీ ఆగడాలు కూడా తగ్గుతాయని భావించి ఉండొచ్చు. అంగ బలం, అర్థ బలం, అధికార బలం ఉన్న పార్టీలను ఎదిరించడానికి ఇలా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం సహజమైన అంశమే.
ఇక దీనితోపాటు మరో అంశమేమిటంటే...కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అవడం, ఒకింత దేశమంతా కూడా ఇంకా మోడీ అనుకూల వాతావరణమే ఉండడం వల్ల ఏదైనా రాజ్యసభకు పంపడమో, లేదా ఏ కేంద్ర మంత్రి పదవినే కట్టబెట్టి రాష్ట్రంలో ఈ కూటమి బలపడేట్టు సహాయపడడానికో కూడా ఇలా పొత్తు పెట్టుకొని ఉండొచ్చు.
ఓవరాల్ గా ఏది ఏమైనా జనసేన గనుక టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉంటే జనసేన జూనియర్ పార్టనర్ గా ఉండాల్సి వచ్చేది. కానీ బీజేపీతో అవడం వల్ల పవన్ న్నే ఏకంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ...ఇంకా అవసరమైతే ఎన్నికలనాటికి టీడీపీని కూడా కలుపుకుపోతే సరి అనేది ఈ ఇరువురి ప్లాన్ గా మనకు కనబడుతుంది.
రేపటి నుండి వైసీపీ నేతలు మాత్రం మరోసారి పాత నినాదం ఏదైతే ఉందొ... జనసేన - బీజేపీ - టీడీపీ అన్ని ఒకటే అనే నినాదాన్ని మరోమారు బలంగా ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్లే ఆస్కారం మాత్రం ఖచ్చితంగా ఉంది.