కరోనా వైరస్: 14 రోజుల క్వారంటైన్ ఎందుకంటే...

By Sree SFirst Published Mar 30, 2020, 8:37 PM IST
Highlights

కేసీఆర్ మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీ తెలంగాణలో కరోనా కేసులు జీరో అవుతాయని అన్నారు. ఏప్రిల్ 7వ తేదీ నాటికి క్వారంటైన్ లో ఉన్నవారందరి గడువు కూడా పూర్తయిపోతుందని, 14 రోజుల సమయం పూర్తయినందున వారిని డిశ్చార్జ్ చేస్తామని కేసీఆర్ అన్నారు. 

కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో యావత్ ప్రపంచం తలమునకలై ఉంది. భారతదేశం కూడా ఈ మహమ్మారి విజృంభిస్తే తట్టుకోలేమని గ్రహించి ముందు జాగ్రత్త చర్యగా లాక్ డౌన్ ను ప్రకటించింది. 

మన తెలుగు  రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగితుంది. రాత్రి ఏకంగా కర్ఫ్యూ కొనసాగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రకంగా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. 

విదేశాల నుంచి వచ్చిన  దాదాపుగా మూడు రోజుల్లో పట్టుకోగలిగారు. వారందరిని క్వారంటైన్ కూడా చేయగలిగారు. అక్కడక్కడా ఎవరైనా మిగిలిపోయుంటే... సాహ్నిక ప్రజాప్రతినిధుల ద్వారా, కాలనీ వాసుల సహాయంతో పట్టుకొని క్వారంటైన్ చేయగలిగారు. 

also read:కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ

మన వద్ద అంతమందిని టెస్ట్ చేసేందుకు సరిఅయిన పరికరాలు కిట్లు అందుబాటులో లేనందున తొలుత క్వారంటైన్ చేసారు. వారిలో లక్షణాలు కనపడగానే వారిని ప్రత్యేక వార్డులకు తరలించారు. అక్కడి వారికి పరీక్షలు నిర్వహించారు. 

అలా లక్షణాలు కనబడ్డ వారందరినీ ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించారు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీ తెలంగాణలో కరోనా కేసులు జీరో అవుతాయని అన్నారు. ఏప్రిల్ 7వ తేదీ నాటికి క్వారంటైన్ లో ఉన్నవారందరి గడువు కూడా పూర్తయిపోతుందని, 14 రోజుల సమయం పూర్తయినందున వారిని డిశ్చార్జ్ చేస్తామని కేసీఆర్ అన్నారు. 

ఇకపోతే మనందరికీ ఇక్కడే కలిగే ఒక ప్రశ్న ఈ 14 రోజుల లొల్లి ఏందిరా అని. 14 రోజుల టైం పీరియడ్ లో ఏం జరుగుతుంది. ఎందుకు కేసీఆర్ ఇలా పదే పదే 14 రోజులని ఎందుకు అంటున్నాడు అనేది ఇప్పుడుఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న. 

14 రోజులకు కరోనాకు అసలు సంబంధం ఏమిటి...?

కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తరువాత అదే రోజు లక్షణాలను చూపెట్టలేదు. మనుషుల శరీర తత్వాలను, వారి రోగ నిరోధక శక్తినిబట్టి కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతాయి. 97 శాతం మందిలో 2 రోజుల నుండి 11 రోజుల మధ్య కాలంలో లక్షణాలు బయటపడతాయి. 

మరి ఇక్కడే మరో ప్రశ్న. వైరస్ కొత్తది కదా 14 రోజుల్లోనే ఎలా బయటపడుతుందని చెబుతున్నారు? కరోనా కన్నా ముందే ఇదే జాతికి చెందిన సార్స్ , మెర్స్ నేర్ రెండు వైరస్ లు ఇప్పటికే మానవాళి మీద దాడి చేసాయి. కరోనా కూడా అదే జాతికి చెందింది. 

Also Read:బ్రేకింగ్: కరోనా ఒత్తిడిని తట్టుకోలేక ఆర్ధికమంత్రి ఆత్మహత్య

ఆ వైరస్ ల లక్షణాలు బయటపడడానికి కూడా సుమారు 11 రోజుల అత్యధిక సమయం పడుతుండడంతో... ఇంకో రెండు రోజులు ఎక్కువేసి 14 రోజులుగా నిశ్చయించారు. 

 97 శాతం మందికి 11 రోజుల్లోపే బయటపడుతుంది. రెండు శాతం మందికి రెండు రొజుల్లొనే వ్యాధి లక్షణాలు కనబడుతాయి. 10వేల మందిలో ఒక్కరికి మాత్రం 14 రోజుల తరువాత మాత్రం కనబడతాయి. కానీ అది చాలా అంటే చాలా అరుదు. 

ఈ క్వారంటైన్ కాలంలో గనుక లక్షణాలు ఏమి కనబడకపోతే... వారిని డిశ్చార్జ్ చేస్తారు. లక్షణాలు ఉంటె వారిని ఐసొలేషన్ వార్డులకు తరలించి చికిత్సను అందిస్తారు. 

చికిత్సను అందించేటప్పుడు ఒక్కొక్కరు కోలుకోవడానికి ఓపీక్కో సమయం పడుతుంది. ఒక్కసారి ఐసొలేషన్ వార్డులోకి వెళ్లిన వ్యక్తి పూర్తిగా కోలుకొని బయటకు పడడానికి పట్టే సమయం కనీసం 10 రోజులు. కొందరిలో అది రెండు వారాలు, మూడు వారల వరకు కూడా ఉండవచ్చు. గరిష్టంగా ఆరువారాల ట్రీట్మెంట్ పొందినవారు కూడా ఉన్నారు. 

ఇలా తెలంగాణలో క్వారంటైన్ లో ఉన్నవారి పీరియడ్ పూర్తికావస్తోంది. దాదాపుగా 25 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారు. అది ఇండ్లలో కానివ్వండి, లేదా ఆసుపత్రుల్లో కానివ్వండి. వీరిక ఇప్పుడు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. 

ఇకపోతే తెలంగాణలో తీసుకుంటున్న చర్యలు పూర్తిగా ప్రశంసనీయం. ప్రతి రాష్ట్రం కూడా గనుక తెలంగాణను ఫాలో అయితే... చాలా త్వరగా కరోనా ఉన్న వారిని సపరేట్ చేసి సాధ్యమైనంతమందిని కాపాడినవారవుతారు. 

click me!