ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే... ఆంధ్రప్రదేశ్ మండలిలో అధికార వైసీపీకి మెజారిటీ లేదు. ప్రతిపక్ష టీడీపీకి మండలిలో బలం ఉంది. అప్పట్లో బలం లేక మండలిని రద్దు చేసిన పార్టీ ఇప్పుడు మండలిని రద్దు చేయొద్దని కోరుతుంది. అప్పట్లో టీడీపీ ఎన్టీఆర్ చేతిలో ఉంటె, ఇప్పుడు ఆయన అల్లుడు, మనవడు చంద్రబాబు. లోకేష్ ల చేతుల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే...ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ దీర్ఘకాలికంగా మూడు రాజధానులను అడ్డుకోలేకపోయినా, ప్రస్తుతానికి మాత్రం ఒకింత ఆలస్యం చేయగలిగింది.
మండలిలో అధికార వైసీపీకి బలం లేకపోవడం వల్ల టీడీపీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంలో సఫలీకృతమైంది. ఒకింత మండలి చైర్మన్ కూడా టీడీపీ నుండే ఎన్నికయినవాడు అవడం వల్ల పెద్దగా ఇబ్బందిలేకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో సక్సెస్ కాగలిగారు.
undefined
Also read: సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు: జరిగేది ఇదీ...
ఒక్కసారిగా జరిగిన ఈ అనూహ్యపరిణామాలకు షాక్ కి గురయిన వైసీపీ మండలిని రద్దు చేస్తామని విషయాన్నీ కూడా యోచన చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతే కాకుండా చాలామంది ఎమ్మెల్సీలు సైతం ఈ విషయం గురించి చర్చించుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
ప్రతిపక్ష టీడీపీ ఏమో మండలి రద్దు అంత తేలికైన వ్యవహారం అంటూనే.. మండలి రద్దును వ్యతిరేకిస్తోంది. ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 1985లో ఇదే తెలుగు దేశం పార్టీ మండలిని రద్దు చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, మండలిలో మాత్రం కాంగ్రెస్ దే హవా.
టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతిబిల్లుకు అడ్డుతగులుతూ ఉండడమతొ అప్పట్లో ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేసాడు. అప్పటి నుండి మల్లి తిరిగి రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యేంతవరకు శాసన మండలి ఊసే లేదు. 2005లో సంకల్పించి 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు అయింది.
ఒకసారి చెన్నారెడ్డి హయాంలో మండలి ఏర్పాటుకు ప్రయత్నం జరిగినా లోక్ సభ రద్దవడంతో ఆంప్హ్రాప్రదేశ్ రాష్ట్రంలో మండలి ఏర్పాటు బిల్లు కూడా లాప్స్ అయింది.
Also read; సెలెక్ట్ కమిటీకి రెండు బిల్లులు: జగన్ సర్కార్ ముందున్న అవకాశాలివీ...
ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే... ఆంధ్రప్రదేశ్ మండలిలో అధికార వైసీపీకి మెజారిటీ లేదు. ప్రతిపక్ష టీడీపీకి మండలిలో బలం ఉంది. అప్పట్లో బలం లేక మండలిని రద్దు చేసిన పార్టీ ఇప్పుడు మండలిని రద్దు చేయొద్దని కోరుతుంది. అప్పట్లో టీడీపీ ఎన్టీఆర్ చేతిలో ఉంటె, ఇప్పుడు ఆయన అల్లుడు, మనవడు చంద్రబాబు. లోకేష్ ల చేతుల్లో ఉంది.
ఇది నాణానికి ఒక పక్క. ఇక రాజన్న రాజ్యం అని చెప్పుకునే జగన్ ఏమో ఇప్పుడు మండలిని రద్దు చేయాలనీ యోచిస్తున్నాడు. ఆ మండలిని పునరుద్ధరించిన తండ్రిని కాదని జగన్ ఇలా రద్దు చేయాలనీ యోచిస్తున్నారు.
తరం మారింది, కాలం ముందుకు సాగింది. కానీ రాజకీయ పరిస్థితులు మాత్రం మరోసారి చరిత్రను పునరావృతం చేసాయి. కాకపోతే అప్పుడు రద్దు చేసిన వారేమో రద్దును వ్యతిరేకిస్తుండగా, పునరుద్ధరించినవారేమో రద్దును కోరుతున్నారు.
History repeats itself, and that's one of the things that's wrong with history. Clarence Darrow