కరోనా వైరస్: ప్రతి వందేళ్లకోసారి మానవాళిని వణికిస్తున్న "మహా"మ్మారి వ్యాధి.

By Sree SFirst Published Mar 3, 2020, 3:11 PM IST
Highlights

ప్రపంచ చరిత్రను గనుక పరిశీలిస్తే.... ప్రతి వందేళ్లకు ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించి పోతుంది. ఆ మహమ్మారి వెళ్ళేది వెళ్ళాక కొన్ని వేల నుంచి లక్షల ప్రాణాలను తన వెంట తీసుకొని వెళుతుంది. ఇప్పుడు మరోసారి ఆ వందేళ్ల సైకిల్ రిపీట్ అవుతుందా అని కారొనను చూసి అందరూ భయపడుతున్నారు. 

ప్రపంచంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు యాదృచ్చికమనాలో లేక అలా జరగాలని ఒక పాటర్న్ ను దేవుడు డిజైన్ చేశాడా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ని చూసినా మనకు ఇదే అనిపిస్తుంది. 

ప్రపంచ చరిత్రను గనుక పరిశీలిస్తే.... ప్రతి వందేళ్లకు ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించి పోతుంది. ఆ మహమ్మారి వెళ్ళేది వెళ్ళాక కొన్ని వేల నుంచి లక్షల ప్రాణాలను తన వెంట తీసుకొని వెళుతుంది. ఇప్పుడు మరోసారి ఆ వందేళ్ల సైకిల్ రిపీట్ అవుతుందా అని కారొనను చూసి అందరూ భయపడుతున్నారు. 

Also read: కరోనా వైరస్ కి దూరంగా ఉండాలంటే... ఈ ఆహారం తీసుకుంటే సరి!

ఇంతకు ఆ ప్రతి వందేళ్లకు వచ్చే వైరస్ ఏమిటా అనే కదా... 1720లో ప్లేగ్ మహమ్మారి విలయతాండవం చేస్తే... 1820లో కలరా ఊడ్చుకుపోయింది, ఇక 1920లో స్పానిష్ ఫ్లూ కరాళ నృత్యానికి ప్రపంచం విలవిల్లాడింది. ఇప్పుడు మళ్ళీ 2020లో ఈ కరోనా వైరస్ ఎం చేస్తుందో అని ప్రపంచం వణికిపోతుంది. 

1720 ప్లేగ్ మహమ్మారి:

1920లో ఫ్రాన్స్ లోని మార్సెయ్ నగరంలో భయంకరమైన ఈ వ్యాధి మొదటిసారిగా బయటపడింది. దాదాపుగా ఒక సంవత్సరం పాటు అక్కడ ఊర్లకు ఊర్లను ఊడ్చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం లక్ష మంది మరణించినట్టు చెబుతారు. ఆ వ్యాధి తీవ్రత ఎంతలా ఉండేదంటే... అక్కడ ఈ ప్లేగ్ వ్యాధి వల్ల మరణించిన వారిని ఒక్కొక్కరిగా పూడ్చి పెట్టడం కష్టంగా మారి సామూహిక సంస్కరణలు చేసేవారు. అంతలా ఈ వ్యాధి అప్పట్లో ఎఉరోపే ని వణికించింది. 

1820 కలరా పిశాచి:

1820ల్లో భారత్ దేశంలోని కలకత్తా నగరంలో ఈ కలరా తొలిసారిగా ప్రబలింది. భారతదేశంలో ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికీ ఈ సారి ప్రబలిన కలరా మాత్రం యూరోప్ వరకు వ్యాప్తి చెందింది. ఆసియ, ఐరోపా ఖండాలను గజ గజ వణికించించింది. ఆగ్నేయాసియా దేశాలు మాత్రం చివురుటాకుల్లా వణికి పోయాయి. ఈ గత్తర దాదాపుగా లక్ష ప్రాణాలను బలితీసుకుంది. 

1920 భయంకరమైన స్పానిష్ ఫ్లూ:

ఈ ఫ్లూ పేరు చెబితేనే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆరోజుల్లో ఇది అప్పటి జనాభాలో 27 శాతం మందికి సోకిందంటేనే దీని వ్యాప్తి ఎలాంటిదో ఊహించవచ్చు. దాదాపుగా 10 కోట్ల మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలను వదిలారు. ఈ వ్యాధి ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న వైరస్ గా దీన్ని ఇప్పటికి పరిగణిస్తారు. 

2020 కరోనా?

ఇప్పుడు ఆ భయంకరమైన స్పానిష్ ఫ్లూ కూడా వెళ్ళిపోయి 100 ఏళ్లయింది. మనం 2020లోకి అడుగుపెట్టాము. ప్రపంచ చరిత్రను చూస్తుంటేనేమో 100 ఏళ్లకు ఒకసారి ప్రపంచాన్ని వణికించే మరో ప్రాణాంతక మహమ్మరేదన్న విరుచుకుపడుతుందేమో అన్న తరుణంలోనే ఈ కరోనా వైరస్ విరుచుకుపడింది. 

Also read: కరోనా వైరస్ సోకిన టెక్కీ ఇల్లు ఇక్కడే: భయం గుప్పిట్లో సికింద్రాబాద్ కాలనీ

చైనాలో ఇప్పటికే కరాళ నృత్యం చేస్తూ నగరాలకు   ఇప్పుడు తాజాగా భారత్ తో సహా ఇతర  దేశాలకు కూడా ఈ వైరస్ పాకింది. మన హైదరాబాద్ లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. 

దీనితో ఇప్పుడు ప్రజలంతా హిస్టరీ రిపీట్ అవుతుందా అని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే అన్ని విధమైన చర్యలను తీసుకుంటున్నాయి. 

click me!