నిరాహార దీక్ష ల విషయంలో కూడా ఇలానే జరిగింది.
జగన్ ఆక్వా రైతులను కలిసి సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చిన రెండు రోజులకే చంద్రబాబు ఆక్వా రైతులను ఆదుకుంటామని ప్రకటించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ ఆక్వా రైతుల సమస్యల పట్ల స్పందించి... యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు.
సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా రొయ్యల చెరువుల దగ్గరకి వెళ్లి వల వేస్తూ రొయ్యల సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుంటూ ఆక్వా రైతులని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.
undefined
ఇది జరిగిన కొద్దీ సమయంలోనే చంద్రబాబు ఆక్వా రైతుల గురించి... వారి సమస్యల గురించి స్పందిస్తూ, అధికారులతో ఆక్వా రైతుల సమస్యల గురించి చర్చించామని.., ఆక్వా ఎగుమతుల వల్ల విదేశీ ఎగుమతుల వల్ల విదేశీ వాణిజ్యం పొందే కేంద్రంతో చర్చించి ఆక్వా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చంద్రబాబు ట్వీట్ చేయటం గమనార్హం.
జగన్ ఆక్వా రైతుల గురించి మాట్లాడుతున్నాడని ఇప్పుడు చంద్రబాబు త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఏముందని రాజకీయ వర్గాలు గూగుసలాడుతున్నాయి. ఇదిలా ఉంటె జగన్ అనుకూల వర్గం మాత్రం జగన్ ఆక్వా రైతుల సమస్యల గురించి మాట్లాడాడు కాబట్టి ప్రభుత్వం స్పందించిందని అనుకుంటుంది.
ఏది ఏమైనా జగన్ ఏది చేపట్టిన, ఏ అంశంపై మాట్లాడినా చంద్రబాబు వెంటనే దానిపై స్పందించటమో... లేకుంటే అలాంటి కార్యక్రమాన్ని చేపట్టడంలో చేస్తున్నారు.
నిరాహార దీక్ష ల విషయంలో కూడా ఇలానే జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో జగన్ దీక్ష చేపట్టగానే చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఏపీలో పార్టీలు ఒకరి కంటే ఒకరు ఎక్కువని నిరూపించుకుంటున్నాయి. ఇది ఒకందుకు మంచిదే అని ఒక వర్గం వాదిస్తుంది ఎందుకంటే పార్టీల మధ్య పోటీ ఎక్కువవుతుండటంతో ప్రజల సమస్యలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తద్వారా పరిష్కారం తొందరగా లభించే అవకాశం ఉన్నట్లే కదా...!
-
హరికాంత్
(రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏసియా నెట్ న్యూస్ తో ఏ విధమైన సంబంధం లేదు. అవి పూర్తిగా రచయిత అభిప్రాయాలు మాత్రమేనని గమనించ మనవి)