GO No 317 controversy: ఆ జివో ఏం చెబుతోంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

By Pratap Reddy KasulaFirst Published Jan 3, 2022, 9:52 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ జీవో ఏం చెబుతోంది, ఎందుకు వ్యతిరేకత ఎదరువుతోందో చూద్దాం.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనదీక్షకు కూడా దిగారు. అసలు ఆ జీవో ఏం చెబుతోంది, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయాలను పరిశీలిద్దాం.


జీవో నెంబర్ 317 ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించే విధానం విధివిధానాలు ఈ విధంగా ఉంటాయి

- ఉద్యోగుల ఆప్షన్ ఫామ్ లను  సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తారు.

- తర్వాత జిల్లాలలో ఉన్న సీనియారిటీ జాబితా ప్రకారం వారు ఇచ్చిన మొదటి ప్రాధాన్యత జిల్లాను వారికి కేటాయిస్తారు.

- ఆ సీనియారిటీ జాబితాలో మొదటగా preferncial categoryలో వున్న వారికి మొదటి ప్రాధన్యత ప్రకారం సీనియారిటీ తో సంబంధం లేకుండా మొదట వారికే కేటాయిస్తారు. (ఉదా:70% వికలాంగుల కలిగిన ఒక ఉద్యోగి సీరియల్ నెంబర్ 640, వీరిని మొదట సీరియల్ నెంబర్ 1లో జిల్లాకు కేటాయిస్తారు. అదే విధంగా దీర్ఘవ్యాధిగ్రస్తున్ని తర్వాత ప్రాధాన్యత, ఆరోగ్యం బాగా లేని పిల్లల ఉద్యోగులను తర్వాత ప్రాధాన్యత, వితంతువును తర్వాత ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాతే సీరియల్ నెంబర్ 1 లో వున్న వారిని తర్వాత వారి ఆప్షన్ ప్రకారం జిల్లాను కేటాయిస్తారు.)

- ఆ తరవాత  జిల్లా  working cadre strength ప్రకారం SC, STలను వారి నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. (ఉదా:  ఒక ఉపాధ్యాయుడు SA (ps)గా ఉమ్మడి rangareddy  జిల్లా సీనియారిటీ 660 మందిలో  సీరియల్ నెంబర్ 630 గా వుంది.. మొత్తం ఎస్టీ ఉపాద్యాయులు 19 మంది వున్నారు. మేడ్చల్ జిల్లా working  cadre strength 192 గా  కేటాయించి విభజించారు. ఆ జిల్లాలో ST ఉపాధ్యాయుల నిష్పత్తి కింది విధంగా చేస్తారు.

- 19÷660×100=2.87% అవుతుంది. మేడ్చల్ జిల్లాలో 192 working cadre strength వున్నది.  అందులో ST ఉపాధ్యాయ నిష్పత్తి 192×2.87%=5.52 అవుతుంది.. అంటే 192 లో 5 లేదా 6 గురు ST ఉపాద్యాయు నిష్పత్తి ప్రకారం కేటాయింపు జరుగుతుంది.

- అదే విధంగా నూతన రంగారెడ్డికి working cadre strength 262 వుంది. ST ఉపాధ్యాయుల నిష్పత్తి 262×2.87%=7.54 అవుతుంది. అంటే 7 లేదా 8 మందిని కేటాయిస్తారు.

- ఆ విధంగా కేటాయించిన ST ఉపాధ్యాయులలో ప్రతి 100 లో వారి రోస్టర్ సీనియారిటీ ప్రకారం కేటాయింపు వుంటుంది

- అదే ప్రాతిపదికన SC ఉపాధ్యాయుడిని రోస్టర్ ప్రకారం కేటాయింపు జరుగుతుంది. ఆ విధంగా SC,ST ఉపాధ్యాయులు వారి నెంబర్ చివరన ఉన్నా కూడా విభజన నిష్పత్తి లో మొదట కేటాయిస్తారు.

ఎందుకు వ్యతిరేకిస్తున్నారు....

కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఆ జీవోను వ్యతిరేకించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఈ జీవో వల్ల జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించి సమస్యలేమీ లేవు. జిల్లా క్యాడర్ కు సంబంధించి తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది. కేటాయింపుల్లో అయోమయం ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. 

స్థానికతను పట్టించుకోకుండా క్యాడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం వల్ల దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. భార్య ఓ జిల్లాలో, భర్త మరో జిల్లాలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేటాయింపు చేసే పద్ధతిని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. 

click me!