కరోనా: తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ, ఇదీ నిదర్శనం...

By Sirisha S  |  First Published Apr 22, 2021, 1:44 PM IST

కరోనా మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో కేంద్రం పూర్తి స్థాయిలో విఫలం చెంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీదకు తోసేసి చేతులు దులుపుకుంటుందన్న విమర్శ వస్తుంది.


దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి యావత్ దేశం చివురుటాకులా వణికిపోతుంది. రోజుకి 3 లక్షల పైచిలుకు కేసులు నమోదవుతుండడంతో... అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఎటూ పాలుపోలేని పరిస్థితుల్లో ఉంది. దేశంలోని ఆసుపత్రి బెడ్లన్నీ నిండుకున్నాయి. వైద్యం అంధక రోజుకు వేళల్లో మరణాలు నమోదవుతున్నాయి. అధికారిక గణాంకాలను పక్కనుంచితే, శ్మశానాల్లో చీతులు ఆరకుండాఆ మండుతున్న వీడియోలు మనకు సోషల్ మీడియా అంతా దర్శనమిస్తున్నాయి. 

ఒకవైపు వాక్సిన్ కొరత, మరోవైపు ఆక్సిజన్, ఇంజెక్షన్ల కొరతతో డాక్టర్లు సైతం ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిపోతున్నారు. పేషెంట్లు తమ కళ్ళముందే మరణిస్తున్నా కాపాడలేక వారు కన్నీరు పెడుతున్న వీడియోలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఈ అన్ని పరిస్థితుల్లో దేశంలో నెలకొన్న ఈ పరిస్థితికి కారణం కేంద్రమే అని సోషల్ మీడియా అంతా దద్దరిల్లుతోంది. మోడీ మేడ్ డిజాస్టర్ అంటూ పలువురు  అభివర్ణిస్తున్నారు. 

Latest Videos

undefined

మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. రెమెడీసీవీర్ ఇంజెక్షన్లు దొరక్క, ఆసుపత్రిలో బెడ్లు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందిని మనం సోషల్ మీడియాలో స్పష్టంగా చూడవచ్చు. ఒక్కో ఇంజక్షన్ ని బ్లాక్ మార్కెట్లో లక్షలు పోసి కొంటున్నారు. తమ ఆప్తులను దక్కించుకోవడానికి తమకు వేరే ఆప్షన్ లేదంటూ ఇల్లు, వాకిళ్ళను తాకట్టు పెట్టి మరీ వైద్యం కోసం వెచ్చిస్తున్నారు. 

తెలంగాణాలో ఇలానే గనుక కేసులు నమోదైతే ఆక్సిజన్ కి ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆక్సిజన్ నిల్వలు అయిపోవచ్చాయని, ఇదే స్థాయిలో ఆసుపత్రుల్లో రష్ కొనసాగితే ఆక్సిజన్ కొరత ఏర్పడొచ్చని వ్యాఖ్యానించారు. కేంద్రం పక్కనున్న బళ్లారి స్టీల్ ప్లాంట్ నుంచో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండో కాకుండా ఒడిశాలోని రూర్కేల స్టీల్ ప్లాంట్ ను కేటాయించారని అది 1,700 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడి నుండి ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోవడానికి వారం సమయం పడుతుందని, ఇదే విషయం కేంద్ర మంత్రితో కూడా చర్చించినట్టు ఆయన చెప్పారు. 

ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలియవస్తుంది. ఈటెల మాట్లాడుతున్నప్పుడు కూడా అది ధ్వనించింది. రాయాష్ట్రంలో అన్ని వయసుల వారికి మాస్ వాక్సినేషన్ ఇవ్వడానికి ఎప్పటినుండో తాము రిక్వెస్ట్ చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆయన వాపోయారు. ఇక మరో మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాని మోడీకి చురకలు అంటించారు. కోవిషిల్డ్ వాక్సిన్ ధర కేంద్రానికి సప్లై చేస్తే 150 రూపాయలు, రాష్ట్రాలకయితే 400 రూపాయలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వాలు ప్రభుత్వాలు కావా,? పీఎం కేర్స్ నిధుల నుండి కేంద్రం వాటిని భరించలేదా అని ఆయన నిలదీశారు. 

వాక్సిన్ ధరలు ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఉండడంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్రాల మీదకు తోసేసి కేంద్రం చేతుయిలెత్తేసిందని పలు బీజేపీయేతర ప్రభుత్వాలు ఆక్షేపిస్తున్నాయి. దేశానికే ఫార్మా రాజధాని అయినా భారతదేశం ఇప్పుడు వాక్సిన్ల కోసం ప్రపంచం ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వాపోయారు. 

click me!