నరేంద్ర మోడీ: భారత్ ఫస్ట్‌ను కలగంటున్న రాజనీతిజ్ఞుడు.. ‘ఈ చాయ్‌వాలా కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’

By Prof S Balarama Kaimal PhD  |  First Published Sep 17, 2022, 8:33 PM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు. ఆయనే నేటి ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో భారత స్థానాన్ని డిఫైన్ చేశారు. మోడీ 72వ పుట్టిన రోజున ప్రొఫెసర్ ఎస్ బలరామా కైమల్ ప్రధాని వ్యక్తిత్వం, ఆయన గంభీర లక్ష్యాలను వివరిస్తున్నారు.
 


ఈ రోజు విశ్వకర్మ జయంతి. కన్య సంక్రాంతి రోజున విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు. ఈ లోక శిల్పి విశ్వకర్మ. ప్రధాని మోడీ 72 పుట్టిన రోజును జరుపుకుంటున్న ఈ రోజే మలయాళ కన్ని నెల మొదలవుతున్నది. భారత్‌ను నేటి ఆధునిక యుగంలో శక్తివంతమైన, సుసంపన్నమైన, సౌభాగ్యవంతమైన, పటిష్టమైన దేశంగా నిర్మించాలని ప్రధాని మోడీ సంకల్పించారు. దేవ లోక నిర్మాత విశ్వకర్మ జయంతి నాడే జన్మించిన ప్రధాని మోడీ దైవభూమిగా భావించే భారత దేశాన్ని పునర్నిర్మించాలని ప్రతిన బూనారు.

మోడీ ఎన్నడైనా దేశ ప్రధాని కావాలని లక్షించారా? స్కూల్ పిల్లలతో సంభాషిస్తూ తాను పీఎం కావాలని ముందుగానే లక్ష్యం పెట్టుకోలేదని అన్నారు. కానీ, ఆయనకు ఆ లక్ష్యం ఉంటే బాగుండేదని నేను విశ్వసిస్తాను. ఎందుకంటే బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించడానికి రేయింబవళ్లు కృషి చేసే వారే మనుషులకు మంచి మోడల్. లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించే పనిలో పడే లక్షణమే మన యువతలో కొరవడింది. ఈ సంప్రదాయం లేకే మన దేశం అభివృద్ధిలో వెనుకపడింది. మన పాఠశాల పాఠ్యప్రణాళికలోనూ ప్లానింగ్ పై టాపిక్ లేకపోవడం వాస్తవం. ప్రాథమిక స్కూల్‌లోనే ఇలాంటివి ఉండటం అమెరికా విజయం వెనుక ఉన్న సత్యం.

Latest Videos

undefined

ఒక ఇంటికి, దాని నిర్మాణంలోని ఇటుకకు మధ్య సంబంధం ఎలా ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? సంస్కృతంలో దీన్నే ఇష్తి, సమష్తి అని పిలుస్తారు. ఇష్తి అంటే ఇటుక, సమష్తి అంటే భవంతి. ఓ భవనం దానికదిగా ప్రత్యేకంగా కనిపిస్తుంది, కానీ, అది కొన్ని వేల ఇటుకలతో రూపుదిద్దుకుంది. ఇక్కడ రెండు విషయాలు ముఖ్యమైనవి. ఒకటి, ఆ ఇటుకలు సరైన విధంగా పేర్చాలి, భద్రంగా ఉండేలా చూసుకోవాలి. రెండోది, లోపాలు లేకుండా తగిన స్థానంలో అందుకు ఒదిగే ఇటుకనే పేర్చాలి. సమాజ నిర్మాణం, దేశ నిర్మాణం కూడా ఇలాంటిదే. సమాజంలో ప్రతి వ్యక్తి ఆయన సామర్థ్యాలకు అనుగుణంగా సరైన స్థితిలో ఉంచి సమాజాన్ని, దేశాన్ని నిర్మించాలి. కాబట్టి, సమాజంలో ప్రతి వ్యక్తి తనకు తానుగా దేశ నిర్మాణానికి సిద్ధపడాలి. ఇందుకోసం ఎవరికి వారు స్వయంగా సన్నద్ధం కావాలి.

చైతన్యవంతం కావడం ఇందులో ఒక భాగం. దీనితోపాటు మన మనస్సులో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం అలుపు లేకుండా పని చేయాలి. దేశ నిర్మాణంలో ఇటుకగా తాము ఉన్నట్టు ప్రతి ఒక్కరు భావించి అందుకోసం కష్టపడాలి. మోడీ తొలినాళ్లలో ఇలాగే తనను తాను సంసిద్ధం చేసుకున్నారు.

ఒక రాజకీయ నేతగా, రాజ్యాంగ హోదాల్లో పని చేసిన వారిగా మోడీ ఆ పని చేశారు. ఇది కేవలం ఊరికే అనలేదు. మోడీ సామాజిక జీవితం ఆర్ఎస్ఎస్‌లో చైల్డ్ వాలంటీర్‌గా చేరిన ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రారంభమైంది. 1971లో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొదట ఆయన సత్యాగ్రహలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ విముక్తి కోసం డిమాండ్ చేసి జన్ సంఘ్‌లో భాగమయ్యారు. ఈ ఆందోళనలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది.

ఆ తర్వాత 1975లో ఎమర్జెన్సీ ప్రకటించారు, అందుకు వ్యతిరేకంగా నిరసనల్లోనూ పాల్గొన్నారు. 1980లో జన్ సంఘ్ బీజేపీ మారింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో ఆయన దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అప్పుడే ఆయన చాలా గ్రామాలతో మమేకం  అయ్యారు. ఇందులో కేరళ గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ అనుభవ సంపత్తి నుంచే ఆయన బీజేపీకి నూతన శక్తియుక్తులను సంపాదించి పెట్టిన రెండు ప్రధాన రాజకీయ ఉద్యమాల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆ రెండు ఉద్యమాల్లో ఒకటి అయోధ్య ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రథయాత్ర, రెండోది మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్ర.

ఆ అనుభవ సంపద నుంచే ప్రజలను దగ్గర నుంచి మోడీ తెలుసుకోగలిగారు. అందుకే ఆయన సామాన్య ఓటర్ల మనసు తెలుసుకోవడమే కాదు.. భారత యువతనే మార్చేయాలని ఆలోచనలు చేశారు. యువత నాడీ పట్టుకోనివారు భారత డిజిటల్ విప్లవానికి ఎలా సారథ్యం వహించగలరు? రేపటి కోసం భారత యువతకు ఆయనే పాఠాలు చెప్పగలరు.

మూల్‌చంద్ మోడీ, హీరాబెన్ దంపతుల ఆరుగురు సంతానంలో నరేంద్ర మోడీ మూడోవారు. వారు చాయ్ వ్యాపారం చేసేవారు. సోదరుడితో కలిసి నరేంద్ర మోడీ కూడా ఈ టీ బిజినెస్ చేశారు. రాజకీయ వారసత్వం లేని కుటుంబంలో మోడీ జన్మించారు. పుట్టుకతో ఆయనకు రాజకీయ హోదా లభించలేదు. ఆయన బంధువులు, పూర్వీకులు ఎవరూ రాజకీయాల్లో లేరు. కానీ, ఆయన ఇప్పుడు కేవలం దేశ ప్రధానమంత్రినే కాదు.. నేటి భారతంలోని శక్తివంతమైన, పాపులర్ నేత కూడా ఆయనే.

ప్రపంచంలోనే ఎక్కువ స్టార్‌డమ్ ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ. గ్లోబల్ రేటింగ్స్‌లోనూ ఆయన ఒక దేశ నేతగా అగ్రశ్రేణిలో ఉంటారు. అటు రష్యా, ఇటు అమెరికా భారత నేతను సంతుష్టం చేయడానికి, మర్యాదగా చూసుకోవడానికి పోటీ పడుతుంటాయి. రాజనీతిజ్ఞుడిగా మారిన మోడీ.. నేటి ఆధునిక ప్రపంచంలో భారత దేశానికి ప్రత్యేక స్థానాన్ని నిర్ణయించగలిగారు. గుజరాత్‌కు చెందిన ఓ చాయ్‌వాలా సాధించిన ఘనత ఇది.

అంతర్జాతీయ విషయాల్లో అమెరికా, రష్యాలు ఆసక్తిగా ఈ టీ షాప్ అబ్బాయి తీసుకునే నిర్ణయాల కోసం వేచి చూస్తుంటాయి. మరెన్నో దేశాలు ఆయన నిర్ణయాలకు మద్దతు తెలుపడానికి ఎదరుచూస్తుంటాయి. ఒకప్పటి ఆ టీషాప్ అబ్బాయే నేడు మన దేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చేయాలని కలగంటున్నారు. మన దేశాన్ని ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని మాట్లాడుతుంటారు, అందుకోసం పాటుపడతారు. భారత దేశం కేంద్రంగా ప్రపంచం మారిపోవాలని కోరుకుంటున్నారు.

ఆయన కేవలం మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు.. మేక్ ఫర్ ది వరల్డ్ అని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఆయన నిలబడిన వేదిక ఆయన కలలకు రూపం కాదు.. ఈ స్థితి ఆయన లక్ష్య ఛేదనకు సాగుతున్న ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే. నిన్న పెట్టిన లక్ష్యాన్ని నేడు అమలు చేయడాన్ని మనం రోజూ చూస్తూనే ఉన్నాం. 

ఎవరికి మాత్రం ఆయన జీవితం మోడల్ కాకుండా ఉంటుంది? ఏపీజే అబ్దుల్ కలాం ఏం చెప్పాడో మరిచిపోయారా: మనం కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి? ఈ నినాదానికి నిలువెత్తు రూపంగా మనకు నరేంద్ర మోడీని కాకుంటే ఇంకెవరిని చూడగలం?

 

రచయిత చెన్నైలోని సవీత మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్. 

ఇక్కడ వెల్లడించిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.

click me!