ఆ అధికారి రాసిన ఆ పదాలు... అందరిని ఆలోచింపజేస్తున్న వైనం!!

By Siva Kodati  |  First Published Oct 2, 2020, 8:41 PM IST

ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల గురించి ఆ అధికారి రాసిన పదాలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ అధికారి మరెవరో కాదు మహిళా భద్రత విభాగం డిఐజి సుమతి ఐపీఎస్


ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల గురించి ఆ అధికారి రాసిన పదాలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ అధికారి మరెవరో కాదు మహిళా భద్రత విభాగం డిఐజి సుమతి ఐపీఎస్.

దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార నేరాల గురించి ఆమె రాస్తూ సమాజంలో పౌరచైతన్యంతోనే ఇది సాధ్యమవుతుందని, ఆడపిల్లల పట్ల అతి కర్కోటక ఘటనలకు అవగాహనా చైతన్యంతోనే అంతం అవుతాయని అన్నారు.

Latest Videos

undefined

మహిళా భద్రత విభాగంలో ఇప్పటికే అడిషనల్ డిజిపి స్వాతి లక్రా తో కలిసి సుమతి మహిళల సమస్యల పట్ల వారి రక్షణ పట్ల ఎన్నో విధానాలు తీసుకొస్తూ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన విషయం విదితమే!! ఆలాగే సోషల్ మీడియాలో కొన్ని అవగాహాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

దానిలో భాగంగానే ఈ  మధ్య సైబర్ ఫర్ హర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించే అందరితో ప్రశంశలు అందుకొని ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న ఆడవాళ్లకు నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.

మహిళా భద్రతా విభాగం అధికారి సుమతి ఏవైనా మాటలు చెప్తే మన ఇంట్లో మన సొంత సోదరి చెప్పిన విధంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ప్రశంశలు కురిపిస్తున్నారు.

ఆడపిల్లల పట్ల జరుగుతున్న సైబర్ సంఘటనలు కానీ, ఇంకా ఇతర ఘటనలు కానీ ఆ అకృత్యాలపై అవగాహన లో భాగంగానే సుమతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహిళలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

అందులో భాగంగా గాంధీ జయంతి సందర్బంగా అందరిని ఆలోచింపజేసేలా కొన్ని పదాలు ఆమె రాసిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఆమె రాసిన కొన్ని పోస్టులు అందరిని ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. గాంధీ చూపిన బాటలో ఆడవాళ్లను గౌరవించి నారిమణులపై పడే నల్లటిమరకలపై సమాజంలో  పౌరచైత్యంతోనే పరిష్కారంగా మారుతుందని తెలిపారు.

 

 

click me!