ఏపీకి మరో కంపెనీ గుడ్ బై: రిస్కులో జగన్, అంబానీ బయటపడేసేనా...?

By Sree S  |  First Published Mar 18, 2020, 6:25 PM IST

ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో 2018లో పెట్టుబడులు పెట్టేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకున్నట్టే అని తెలిపింది.  ఈ ఎపిపి సంస్థ ఇండోనేషియా కు చెందిన సినర్ మస్ గ్రూప్ కు అనుబంధ సంస్థ. 


కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీమ్ కోర్టును కూడా ఆశ్రయించింది. 

సుప్రీంకోర్టు జగన్ సర్కార్ వైఖరిని తప్పుబడుతూ... ఎన్నికల సంఘానిదే నిర్ణయాధికారం అని నేటి ఉదయం తెలిపింది కూడా. ఈ విషయం పక్కనుంచితే... ఈ స్థానిక రగడలో పది ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక కంపెనీ వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలియవస్తుంది. 

Latest Videos

undefined

తెలుగు దినపత్రిక ఈనాడు కథనం ప్రకారం ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో 2018లో పెట్టుబడులు పెట్టేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకున్నట్టే అని తెలిపింది.  ఈ ఎపిపి సంస్థ ఇండోనేషియా కు చెందిన సినర్ మస్ గ్రూప్ కు అనుబంధ సంస్థ. 

Also read; ఈసీ రమేష్ కుమార్ తో జగన్ చెలగాటం... పిల్లలకు ప్రాణసంకటం!

చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో 24 వేల కోట్ల పెట్టుబడితో పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇంత భారీ మొత్తంలో ఇంతవరకు ఏ సింగల్ కంపెనీ కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోనే పెట్టలేదు. 

సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2,471 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తమ సంస్థకు సంబంధించిన అతి పెద్ద ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఎపిపి ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ గనుక ఏర్పాటు చేసి ఉంటె... 4 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఈ కంపెనీ కల్పించగలిగేది. పరోక్షంగా మరో 12వేల ఉద్యోగాల కల్పనా జరిగేది. 

వెనుకబడ్డ ప్రకాశం జిల్లాలో ఈ కంపెనీ అక్కడ స్థానికంగా ప్రభావవంతమైన మార్పును తీసుకురాగగలిగేది. అక్కడ ఉపాధి, ఉద్యోగ కల్పనలతోపాటు మౌలిక సదుపాయాలు కూడా విపరీతంగా పెరిగేవి. భూములకు విలువ వచ్చేది. 

గతంలో కూడా ఈ కంపెనీ రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందని వార్తలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వార్తలను ఖండించింది. లాక్ కంపెనీతో రాష్ట్రప్రభుత్వ వర్గాలు చర్చలు జరుపుతున్నాయని, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. 

ఇక తాజాగా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఆ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేఖలకు స్పందించడం మానివేసిందట. అందుతున్న సమాచారం మేరకు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న మహారాష్ట్ర లేదా గుజరాత్ రాష్ట్రంలో నూతన ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ప్రపంచ బ్యాంకు నుంచి మొదలుకొని ఏఐఐబీ వరకు అనేక బ్యాంకులు ప్రోజెక్టుల నుంచి తప్పుకున్నాయి. అదానీ గ్రూపు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే అంబానీకి చెందిన రిలయన్స్ కూడా వెళ్ళిపోతుందని వార్తలు వచ్చాయి. 

Also read; జగన్ ను ఫాలో అవుతున్నకేసీఆర్: చింతమనేనికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి!

2018లో రిలయన్స్ గ్రూప్ తిరుపతిలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఎలక్ట్రానిక్స్ పేర్కొని ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ అధినేత  ముఖేష్ అంబానీ ప్రకటించారు. చంద్రబాబు హయాంలోని గత ప్రభుత్వంతో అంబానీ ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. 

ఎన్నికల తరువాత జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఆ పార్కుపై ఎటువంటి చర్చ కూడా సాగట్లేదు. దాదాపుగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ ప్రపోసల్ కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంది. 

అయితే వైసీపీ అధినేత జగన్ ను ముఖేష్ అంబానీ కలిసారా... లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రిలయన్స్ అధినేత స్థానంలో ముఖేష్ అంబానీ కలిసారా అనేది ఇక్కడ కీలకం. 

నత్వాని సీటు కోసమే ఆయన కలిస్తే... దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అదే సీటు విషయంతోపాటుగా సీటిస్తున్నందుకు వైసీపీ సభ్యులు చెప్పినట్టు రిలయన్స్ అధినేత ఆ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తే మాత్రమే లాభముంటుంది. 

అలా గనుక అంబానీ పరిశ్రమను ఏర్పాటు చేసి ముందుకెళితే... రాష్ట్రంలో పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అత్యంత కీలకం. అలా గనుక కాకుండా ఆయన కేవలం రాజ్యసభ సీటు కోసం మాత్రమే కలిసుంటే మాత్రం అంత లాభం ఉండకపోవచ్చు. 

అయినా పరిమళ నత్వాని ఝార్ఖండ్ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా కొనసాగినా కూడా, ఆ సమయంలో రిలయన్స్ గ్రూపులో పెద్ద స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా ఝార్ఖండ్ లో ఎంత మేర పెట్టుబడులు పెట్టించగలిగారు చెప్పండి? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి!

click me!