'మహా' రాజకీయాలు: అందరి చూపూ పంకజ ముండేపైనే...

By telugu team  |  First Published Dec 12, 2019, 3:48 PM IST

ఓబీసీ సీనియర్ నేత పంకజ ముండే ఎం చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తన తండ్రి గోపినాథ్ ముండే జన్మదినోత్సవం సందర్భంగా ఆమె ఈరోజు ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతోపాటు సీనియర్ బీజేపీ నేత ఎకనాథ్ ఖడ్సే సైతం ఆమెకు వంత పాడుతున్నారు


బీడ్: మహారాష్ట్ర రాజకీయాలు అన్ని పార్టీలకు సంకటంగా మారాయి. పౌరసత్వ బిల్లుకు మద్దతు విషయమై శివసేన, కాంగ్రెస్ ల మధ్య తొలుత చిచ్చు చెలరేగి ఆ తరువాత అది చల్లారినప్పటికీ, ఒక దశలో కాంగ్రెస్ శివసేనకు తన మద్దతును ఉపసంహరించుకునేందుకు కూడా వెనకాడలేదు. 

ఒక వేళ ఈ పరిణామం గనుక చేయిదాటిపోయి ఉంటే, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీలు తీవ్రంగా నష్టపోయేవి. ఇది అధికారపక్షం గురించి. ఇక ప్రతిపక్షంలో కూర్చున్న బీజేపీకి కూడా కష్టాలు లేకపోలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బయటపడుతున్నాయి. 

Latest Videos

undefined

ఓబీసీ సీనియర్ నేత పంకజ ముండే ఎం చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తన తండ్రి గోపినాథ్ ముండే జన్మదినోత్సవం సందర్భంగా ఆమె ఈరోజు ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతోపాటు సీనియర్ బీజేపీ నేత ఎకనాథ్ ఖడ్సే సైతం ఆమెకు వంత పాడుతున్నారు. 

ఇప్పటికే ఎకనాథ్ ఖడ్సే ఇటు ఉద్ధవ్ థాక్రేను, అటు శరద్ పవార్ ను కలిశారు. ఏ పార్టీలో చేరితే తనకు లాభమో తేల్చుకునే పనిలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఇక పంకజ ముండే విషయానికి వస్తే ఆమె ముందు మూడు ఆప్షన్స్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 

పార్టీలోనే కొనసాగుతూ, ఒక ఓబీసీ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి పార్టీకి తన శక్తి సామర్థ్యాలను నిరూపిస్తూ ఒక బాల ప్రదర్శనకు దిగే ఆస్కారం ఉంది. లేదా ఊరికే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను తోడుగా తీసుకొని ఒక బలనిరూపణలాగా ఆ ఎమ్మెల్యేలందరితోని పెరేడ్ చేపించి, తనను తేలికగా తీసుకోవద్దని సంకేతాన్ని అధినాయకత్వానికి పంపే ఛాన్స్ కూడా లేకపోలేదు.

Also read: శివసేనలోకి పంకజ ముండే? ట్విట్టర్ బయోలో బీజేపీ లీడర్ అని తొలగింపు

ఇక చివరగా ఆమె శివసేనలో చేరే మూడవ ఆప్షన్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఆమె తన సోదరుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే తో తన తండ్రి రాజకీయ వారసత్వం గురించిన సవాళ్ళను ఎదుర్కోవాలంటే, తాను కూడా అధికార పక్షంలో ఉండక తప్పనీవుసారి పరిస్థితి. 

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ ముండే తన సోదరుడు వరుసయ్యే ధనుంజయ్ ముండే చేతిలో పర్లి నియోజకవర్గంలో ఓటమి చెందడంతో ఈ సమస్య తెర మీదకు వచ్చింది.  కొన్నిరోజుల కింద  ఆమె తన ట్విట్టర్ బయోలో బీజేపీ లీడర్ అనే పదాన్ని తొలగించింది. 

దానికి ముందు ఆమె ఒక బాంబు పేల్చి అందరిని విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 12వ తారీఖునాడు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా రాజకీయ భవిష్యత్తు గురించి తన అనుచరులతో చర్చిస్తానని చెప్పారు. 

అసలు పంకజా ముండే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం కూడా లేకపోలేదు. తన తండ్రి వారసుడెవ్వరనే ప్రశ్న ఇక్కడ ఉద్భవించింది.

ఈ సారి తనకు అత్యంత పట్టున్న, తన కుటుంబ కంచుకోటగా భావించే పేర్ల లో ఆమె ఓటమి చెందింది. ఓడించింది ఎవరో కాదు, తనకు వరుసకు అన్నయ్య అయ్యే ధనుంజయ్ ముందే చేతిలో. ఇలా ఓడిపోవడంతో, తన తండ్రి వారసత్వం తన చేతికి కాకుండా తన అన్న చేతికి ఎక్కడ పోతుందో అనే భయం పంకజా ముండేలో మొదలయ్యింది. 

Also read: తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

ఒకవేళ గనుక పంకజా ముండే గనుక గెలిచి ఉంటె, ఆమె ఈ సరి ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీలో ఉండేది. తొలుత ఫడ్నవీస్ మిత్రవర్గంలో ఉన్న ఈమె, ఆ తరువాత సైడ్ లైన్ చేయబడింది. ఈ విషయమై ఈమె చాల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం కూడా కోల్పోవడంతో పంకజా ముండే ఆలోచనలో పడింది. 

గోపినాథ్ ముండే అత్యంత పాపులారిటీ కలిగిన లీడర్. ఆయన లోక్ నేత గా మహారాష్ట్ర ప్రజలు ఈయనను పిలిచేవారు. ఇలాంటి నాయకుడి కూతురును నన్ను ఇలా పక్కకు పెట్టారు అని పంకజా ముండే గుర్రుగా ఉన్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలోనే ఆమె ఈ మూడు ఆప్షన్స్ లో ఏదో ఒకదాన్ని మాత్రం ఖచ్చితంగా ఎన్నుకునే ఆస్కారం ఉంది. అయితే, కొన్ని రోజులకింద తన మద్దతుదారులైన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని శివసేనతో చేరుతారనే ప్రచారం బలంగా సాగుతుంది. దీన్ని ఎలాగైనా ఆపడానికి బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఇక్కడ కాకపోతే ఇంకో ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. పంకజా ముండే చెల్లి ప్రీతం ముండే బీడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతుంది. మొన్న డిసెంబర్ 10వ తేదీనాడు చెల్లెలు ప్రాతం ముందే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే కావాలని బీజేపీ ఎంపీ అని ఆడ్ చేసారు. 

ఈ ఆసక్తికర పరిణామం నేపథ్యంలో పంకజ ముండే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో... చెల్లెలి రాజకీయ భవిష్యత్తుతో కలిపి నిర్ణయం తీసుకుంటుందా లేదా తన దారి మాత్రమే తనది అని చూసుకొని పార్టీ మారుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. 

click me!