బంగారానికి బదులు టమాటతో నగలు.. వధువు వీడియో వైరల్

Published : Nov 20, 2019, 12:07 PM IST
బంగారానికి బదులు టమాటతో నగలు.. వధువు వీడియో వైరల్

సారాంశం

బంగారు వర్ణపు గాగ్రా ధరించిన సదరు యువతి... పాపిట బిళ్ల, హారం, గాజులు, చెవి దద్దులు ఇలా అన్నీ కూడా టమోటాలతో కూడిన ఆభరణాలే ధరించింది.  ఈ టమాట ఆభరణాల గురించి ఆమెను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి ఆమె సమాధానం ఇచ్చారు

బంగారం కొనకుండా పెళ్లిళ్లు జరగడం అరుదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అసలు బంగారం కొనకుండా పెళ్లిని ఊహించలేం. ఎందుకంటే.. పీటలమీద కూర్చునే దంపతులు పట్టు వస్త్రాలతోపాటు బంగారం ధరించి అందంగా ముస్తాబౌతారు.

అయితే... ప్రస్తుతం బంగారం ధర ఆకాశనంటుతోంది. గ్రాము బంగారం కొనాలన్నా... ఆలోచించాల్సిన పరిస్థితి. మన దేశంలో పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.40వేలు ఉంది. ఇక  పాకిస్తాన్ లో అయితే రూ.70వేలపైనే ఉంది.

ధర అంత ఎక్కువగా ఉండటంతో.. బంగారం కొనలేని పరిస్థితిలో ఓ యువతి వినూత్నంగా ఆలోచించింది. గ్రాము బంగారం లేకుండానే చాలా అందంగా బుస్తాబయైంది. తన పెళ్లికి టమాట పండ్లతో ఆభరణాలు తయారు చేసుకొని ముస్తాబయ్యింది. కాగా... ఆ నవ వధువుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

బంగారు వర్ణపు గాగ్రా ధరించిన సదరు యువతి... పాపిట బిళ్ల, హారం, గాజులు, చెవి దద్దులు ఇలా అన్నీ కూడా టమోటాలతో కూడిన ఆభరణాలే ధరించింది.  ఈ టమాట ఆభరణాల గురించి ఆమెను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి ఆమె సమాధానం ఇచ్చారు.

‘‘ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం టమాట ధరలు కూడా భారీగానే ఉన్నాయి. అందుకే బంగారానికి బదులు టమాటలతో నగలు వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను’’ అని ఆమె చెప్పడం విశేషం. కాగా... పాకిస్తాన్ లో టమాటలు ధర భారీగా పెరిగినట్లు సమాచారం. కేజీ టమాటలు రూ.300 ఉన్నట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Overworked: ఆఫీస్‌లో 70 గంటలకు పైగా ఉద్యోగం.. చివరికి విడాకులు కోరిన భార్య.. టెక్కీ మనో వేదన ఇలా!
Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్‌, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?