‘లిఫ్ట్ లో 71 గంటలు.. ఆకలేసి భార్యను తినేసిన భర్త…అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఒక ఫేక్ న్యూస్

By telugu teamFirst Published Nov 12, 2019, 11:44 AM IST
Highlights

"లిఫ్ట్ లో 71 గంటలు.. ఆకలేసి భార్యను తినేసిన భర్త …అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఒక ఫేక్ న్యూస్. వార్త మా వెబ్ సైట్‌లో తప్పుగా వ్రాయబడినది.  విదేశీ వార్తా సంస్థ   ’ world News Daily Report” అనే ఒక ‘వ్యంగ్యపు’ వార్తలు రాసే వెబ్ సైట్‌ కథనం ఆధారంగా ఈ వార్తను వ్రాయడం జరిగింది.


"లిఫ్ట్ లో 71 గంటలు.. ఆకలేసి భార్యను తినేసిన భర్త"…అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఒక ఫేక్ న్యూస్.  "లిఫ్ట్ లో 71 గంటలు.. ఆకలేసి భార్యను తినేసిన భర్త"…వార్త మా వెబ్ సైట్‌లో తప్పుగా వ్రాయబడినది.  వార్త కథనంలో ఫిలడెల్ఫియాలోని ఒక లిఫ్ట్ లో 71 గంటలపాటు భార్యాభర్తలు ఇరుక్కుపోయారని, ఆకలికి తట్టుకోలేక భర్త భార్యని తినేశాడని రాయడం జరిగింది. ఈ వార్త కథనం ఒక ఫేక్ న్యూస్. 

విదేశీ వార్తా సంస్థ   ’ world News Daily Report” అనే ఒక ‘వ్యంగ్యపు’ వార్తలు రాసే వెబ్ సైట్‌ కథనం ఆధారంగా ఈ వార్తను వ్రాయడం జరిగింది. అయితే లోతుగా విచారించిన తర్వాత ఇది అవాస్తవమైన నిరాధారమైన వార్త అని తెలింది. కావున మా వైబ్ సైట్ నుంచి తొలిగించడం జరిగింది.

వాస్తవానికి ఇదొక ఫేక్ న్యూస్.ఆ విషయం తెలియక ప్రచురించినందుకు మేము చింతిస్తున్నాము.  అన్ని వార్తలను అందించాలనే ఉద్దేశంతో, పొరపాటుగా ఈ ఫేక్ న్యూస్ ని కూడా ప్రచురించాము. పాఠకులకు ఇలాంటి వార్త ప్రచురించినందుకు క్షమాపణలు కోరడంతోపాటు, భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురితం కాకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాము. ఈ వార్తను వ్రాసినందుకు గాను పాఠకులను క్షమాపణలు కోరుతున్నాం. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని పాఠకులకు తెలుపుతున్నాం. ఇకమీదట ఇటువంటి వార్తలు ప్రచురించబోమని హామీ ఇస్తున్నాము. 


 

click me!