Using Fevikwik on Childs Wound కుట్లకు బదులు ఫెవిక్విక్.. పనికిమాలిన పని చేసిన పాడు నర్సు!

కర్ణాటకలో ఒక నర్సు పిల్లవాడి గాయానికి కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్ వాడిన సంఘటన కలకలం రేపింది.  ఆమెను సస్పెండ్ చేశారు.

Google News Follow Us

కర్ణాటకలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక నర్సు కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ను ఉపయోగించింది, దీని తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జనవరి 14 న జరిగింది, ఏడేళ్ల గురుకిషన్ అన్నప్ప హోసమణికి బుగ్గపై లోతైన గాయం అయింది, దాని తర్వాత అతని తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

నర్సు మాటలు విని తల్లిదండ్రులు షాక్

ఆసుపత్రికి చేరుకున్న తర్వాత, నర్సు తల్లిదండ్రులకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఇద్దరూ షాక్ కి గురయ్యారు. నర్సు వారి ఆందోళనను తగ్గించడానికి ప్రయత్నిస్తూ, తాను చాలా సంవత్సరాలుగా ఇలా చేస్తున్నానని తెలిపిది. పైగా కుట్లు వేస్తే పిల్లాడి ముఖంపై శాశ్వత మచ్చలు ఉంటాయని చెప్పింది. పిల్లల తల్లిదండ్రులు ఈ ఘటనను తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు.
 

నర్సు సస్పెండ్

పిల్లల తల్లిదండ్రులు నర్సు వీడియోను రికార్డ్ చేసి సాక్ష్యంగా సమర్పించారు, ఆపై అధికారిక ఫిర్యాదు కూడా చేశారు. అయితే, వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ, నర్సు జ్యోతిని సస్పెండ్ చేయడానికి బదులుగా ఫిబ్రవరి 3న హవేరి తాలూకాలోని గుత్తల్ ఆరోగ్య సంస్థకు బదిలీ చేశారు, దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.  ఒత్తిడి పెరగడంతో అధికారులు ఇప్పుడు నర్సును సస్పెండ్ చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం, చికిత్స పొందుతున్న పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాడు.  సాధారణంగా వస్తువులను అతికించడానికి ఉపయోగించే ఫెవిక్విక్‌ను వైద్యపరంగా ఉపయోగించడం నిబంధనల ప్రకారం నిషేధం. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ సేవల కమిషనర్ కార్యాలయం ప్రకటన ప్రకారం, పిల్లల చికిత్సలో దీనిని ఉపయోగించడం విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నర్సును సస్పెండ్ చేశారు మరియు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.