అది నేనేనా.. లేక మరొకటా: అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని .. ఎలుగు బంటి రియాక్షన్ , వీడియో వైరల్

Siva Kodati |  
Published : Jul 12, 2022, 04:08 PM IST
అది నేనేనా.. లేక మరొకటా: అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని .. ఎలుగు బంటి రియాక్షన్ , వీడియో వైరల్

సారాంశం

ఓ ఎలుగు బంటి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఇస్తున్న రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.   

అప్పుడప్పుడు జంతువులు చేసే పనులు భలే ముచ్చటగా వుంటాయి. అమాయకంగా అవి చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తూ వుంటాయి. అచ్చం ఇలాంటి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఎలుగుబంటి అద్దంలో తనను తాను చూసుకుని ఆశ్చర్యపోతోంది. ఒక అడవిలోని స్తంభంపై అమర్చిన అద్దం అటుగా వెళ్తున్న ఓ ఎలుగుబంటిని ఆకర్షిస్తోంది. దీంతో అది ఏంటా అని దగ్గరకు వెళ్లిన ఎలుగు.. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని షాక్ కు గురవుతుంది. 

ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే .. ఎలుగుబంటి తొలుత అద్దం నుంచి దూరంగా జరగడం కనిపిస్తుంది. అక్కడ తాను కాకుండా మరో జంతువు ఏదో వుందని భయపడి , అది నిర్ధారించుకోవడాని కి మళ్లీ అద్దంలోకి తొంగి చూస్తోంది. తన వెనుక మరో ఎలుగుబంటి నిలబడి వుందని, దీనిని గమనించేందుకు అద్దాన్ని తరచూ చూస్తోంది.. కానీ అది మాత్రం కనిపించడం లేదు. దీంతో కోపం వచ్చి అది అద్దాన్ని నేలపైకి లాగడాన్ని ఆ వీడియోలో మనం గమనించవచ్చు. 

దీనిని సోషల్ మీడియాలో 76 డోరేమి అనే వ్యక్తి షేర్ చేశారు. ఆ కాసేపటికే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేవలం ఒక్క రోజులో 14,000కు పైగా ఓట్లను, వందలాది కామెంట్స్ ను పొందింది. దీనిని చూసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘తాను ఈరోజు డిపార్ట్‌మెంట్ స్టోర్ లో కొన్ని షర్టులు చూస్తున్నాను.. కొంతమంది నా దగ్గరగా వస్తూనే వున్నారు. ఆ తర్వాతే అర్ధమైంది ఇది అద్దమని’’ అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. అయితే అది ఎప్పుడు ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Overworked: ఆఫీస్‌లో 70 గంటలకు పైగా ఉద్యోగం.. చివరికి విడాకులు కోరిన భార్య.. టెక్కీ మనో వేదన ఇలా!
Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్‌, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?