ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివేక్ రాజు అనే యువకుడు తన పంజాబీ రాష్ట్రానికి చెందిన ప్రియురాలి గురించి ట్విట్టర్ వేదికగా పంచుకొన్నాడు. బాలీవుడ్ సినిమా తరహాలోనే ఈ ప్రేమ కథ ఉందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివేక్ రాజు అనే యువకుడు తన పంజాబీ రాష్ట్రానికి చెందిన ప్రియురాలి గురించి ట్విట్టర్ వేదికగా పంచుకొన్నాడు. బాలీవుడ్ సినిమా తరహాలోనే ఈ ప్రేమ కథ ఉందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
గత రాత్రి నేను తన ప్రియురాలి గురించి తన తల్లిదండ్రులకు చెప్పినట్టుగా ఆయన ఆ ట్వీట్ లో తెలిపాడు. నేను ఆంధ్రప్రాంతానికి చెందిన వాడిని. నా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం పంజాబీ. ఈ విషయాన్ని చెప్పగానే మా అమ్మ మాత్రం సరేనంది. కానీ నాన్న నుండి మౌనమే సమాధానంగా వచ్చిందని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
undefined
&nbs
Broke the news about my girlfriend to my parents last night. We are from Andhra. Girlfriend is Punjabi.
Fun times in the house. Mom is okay. Dad has gone completely silent.
Having fun observing this once in a lifetime reaction from parents (unless my brother drops a bomb too)
p;
ఆ తర్వాతి ట్వీట్ లో తన ప్రియురాలి కుటుంబం చాలా మంచిదని ఆయన రాసుకొచ్చాడు. ఇందులో ఎలాంటి డ్రామాలు లేవన్నారు. అయితే ఈ విషయమై వివేక్ తండ్రి ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తిగా నెటిజన్లు చూశారు. కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ విషయం గురించి తాను చెప్పే మాటలను వినేందుకు తన తండ్రి ఆసక్తిని చూపలేదని వివేక్ తెలిపారు. కానీ తన తల్లి మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ ఫోటోను తన కుటుంబ సమూహంలో పంచుకోవాలని నిర్ణయించుకొందన్నారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత తన తండ్రి నుండి ఎలాంటి సమాధానం లేదని ఆయన మౌనంగానే ఉన్నాని ఆయన ట్వీట్ చేశారు.
ఈ విషయమై తన తల్లి ఉత్సాహంగా ఉందని ఆయన నెటిజన్లతో పంచుకొన్నాడు. తన కోడలు ఎలా ఉంటుంది, తమ కుటుంబంతో ఎలా కలిసిపోతోందనే విషయమై కలలు కంటుందని చెప్పారు.స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వివేక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చర్చతో తన తండ్రికి ఎర వేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.వివేక్ ట్విట్టర్ లో చేసిన పోస్టులపై చాలా మంది నెటిజన్లను కట్టిపడేసింది. ఈ విషయమై కొందరు ఆయనకు సలహాలను అందించారు.
ఒక నెటిజన్ తన స్వంత అనుభవాన్ని వివేక్ తో పంచుకొన్నారు. తన భార్య ఆంధ్రప్రాంతానికి చెందింది. తాము మధ్యప్రదేశ్ నుండి వచ్చాం. తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించటానికి పడిన కష్టాన్ని వివరించారు. చివరికి రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకొన్నామన్నారు. ప్రేమ అందరినీ గెలిపిస్తోందని రాహుల్ సాహు అనే వ్యక్తి తన పెళ్లి జరిగిన తీరును వివరించారు.
కొందరు నెటిజన్లు మాత్రం ఇండియన్ పేరేంట్స్ తీరుపై విరుచుకుపడ్డారు. అయితే తన తండ్రి పక్షాలన వివేక్ నెటిజన్లతో వాదించారు.వివేక్ పరిస్థితిపై చాలా మంది నెటిజన్లు బాలీవుడ్ చిత్రం టూ స్టేట్స్ తో పోల్చారు. తమిళనాడు-పంజాబీ పెళ్లి గురించి ఈ చిత్రంలో చూపారు.