యూకేలో కరోనా సోకి విజయవాడ వాసి మృతి

By telugu news teamFirst Published Apr 21, 2020, 8:48 AM IST
Highlights

విజయవాడకు చెందిన కొప్పారపు హనుమంతరావు అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే యూకేలో సెటిల్ అయ్యారు. ఇటీవల స్థానికంగా ఓ వ్యక్తి చనిపోతే.. అతని అంత్యక్రియలకు హనుమంతరావు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వారిలో ఒకరి నుంచి అతనికి కరోనా సోకింది.
 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. తాజాగా యూకేలో ఓ తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  విజయవాడకు చెందిన కొప్పారపు హనుమంతరావు అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే యూకేలో సెటిల్ అయ్యారు. ఇటీవల స్థానికంగా ఓ వ్యక్తి చనిపోతే.. అతని అంత్యక్రియలకు హనుమంతరావు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వారిలో ఒకరి నుంచి అతనికి కరోనా సోకింది.

ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. హనుమంతరావు యూకేలో శాశ్వత పౌరుడు కావడం గమనార్హం. ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ వొడాఫోన్ లో ఉద్యోగం చేస్తున్నారు.  అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, పేరెంట్స్ ఉన్నారు.

కాగా.. హనుమంతరావు బంధువులు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఉన్నారు. కాగా.. ఈయన గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో విద్యనభ్యసించారు.

ఇదిలా ఉండగా... ఆయన అంత్యక్రియల కోసం స్థానిక భారతీయులు.. నగదు సేకరిస్తున్నారు. సోమవారం  నాటికి 47వేలు సేకరించినట్లు అధికారులు చెప్పారు.

click me!