అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు: పరిస్ధితి విషమం

By Siva KodatiFirst Published Apr 12, 2020, 8:35 PM IST
Highlights

అమెరికాలో జరిగిన కాల్పుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో జరిగిన కాల్పుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... మనుబోలు మండలం మడమనూరుకు చెందిన డేగా ధీరజ్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు.

Also Read:కరోనా విలయతాండవం.. అమెరికాలో ఒక్కరోజే 2వేల మంది బలి

ఈ క్రమంలో ఏప్రిల్‌ 9న చికాగోలోని సెయింట్ లూయిస్‌కు ఓ పని నిమిత్తం వెళ్లాడు. అక్కడ సెల్లార్‌లో కారును పార్కింగ్ చేస్తుండగా కొందరు నల్లజాతి దుండగులు ధీరజ్‌పై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఉదర భాగానికి ఎడమ వైపు నుంచి శరీరంలోకి ప్రవేశించిన బుల్లెట్ కుడివైపున పేగు, కాలేయాన్ని దెబ్బతీసింది.

Also Read:కరోనా : చికాగో నుండి ఖైదీలను మరో జైలుకు తరలింపును తిరస్కరించిన జడ్జి

ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద ఉన్న అతడి పరిస్ధితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ధీరజ్ శరీరంలో ఇంకా బుల్లెట్ ఉండటంతో శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే అతని హార్ట్ బీట్, బీపీ లెవల్స్ గత రాత్రితో పోలిస్తే సాధారణంగా ఉండటంతో ధీరజ్  కోలుకోవాలని మిత్రులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు భారత యువకుడిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధీరజ్‌కు గో ఫండ్ మీ అనే సంస్థ మద్ధతుగా నిలిచింది. 

click me!