అమెరికాలోని ప్రఖ్యాత యేల్ యూనివర్శిటీలో నిత్యం పరిశోధనల్లో మునిగి తేలే రవికిరణ్ కాసుల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనెక్టికట్ న్యూ హెవెన్స్ లోని ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.ప్రస్తుత సంక్షోభ కాలంలో తన అనుభవాలను, అనుభూతులను ఏషియానెట్ న్యూస్ తెలుగుతో పంచుకున్నారు. ఆ అనుభవాలు మీకోసం.
అమెరికాలోని ప్రఖ్యాత యేల్ యూనివర్శిటీలో నిత్యం పరిశోధనల్లో మునిగి తేలే రవికిరణ్ కాసుల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనెక్టికట్ న్యూ హెవెన్స్ లోని ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. మనసుకు నచ్చినప్పుడు ఆంగ్లంలో కవిత్వం రాస్కుంటారు . ఆంగ్లంలో ఓషియానిక్ సెయిల్ అనే కవితా సంపుటి కూడా వెలువడింది. హైదరాబాదుకు చెందిన రవి కిరణ్ కాసుల ప్రస్తుత సంక్షోభ కాలంలో తన అనుభవాలను, అనుభూతులను ఏషియానెట్ న్యూస్ తెలుగుతో పంచుకున్నారు. ఆ అనుభవాలు మీకోసం.
బోలెడు ఆశలతో, ఏవేవో ప్లాన్స్ తో నూతన పరిశోధనల మీద ఆలోచనలతో నా మార్చ్ మొదటివారం ప్రారంభమయింది. ఇటలీలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం గురించి వార్తలు వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇంతలోనే హార్వార్డ్ విశ్వవిద్యాలయం కూడా క్లాసులన్నీ ఇక ఆన్ లైన్ లోనే అనే నోటీసును జారీ చేసింది. ల్యాబ్స్ అన్ని కూడా త్వరలోనే మూసేయాలని తెలిపింది.
మా యూనివర్సిటీ యేల్ మాత్రం కొన్ని రోజుల తరువాత ఇలా ఆన్ లైన్ క్లాసుల నిర్ణయం తీసుకున్నప్పటికీ ల్యాబుల్లో పరిశోధనలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. కానీ మా మొఖాల్లో ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అదే వారం చివరకు వచ్చ్చేసరికి ఆ ల్యాబులను కూడా మూసేయమని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.
ఈ ల్యాబులు మూసేయాలని తీసుకునే నిర్ణయానికి ముందు ఒక నార్మల్ ల్యాబ్ మీటింగ్ కి వెళ్ళాను. అక్కడ అందరం కలిసి పిజ్జా తింటూ మాట్లాడుకుంటుండగా మా బాస్ రానే వచ్చాడు. ఆయన రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. సాధారణంగా ల్యాబ్ ప్రోజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు ఉండే పరిస్థితి కన్నా భిన్నమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.
సాధారణ ప్రాజెక్టు విషయాలు పూర్తయిన తరువాత ల్యాబ్ పరిస్థితి, అందులో కొనసాగుతున్న పరిశోధనలపై అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది అసలు టెన్షన్ కి కారణం. మా బాస్ ప్రస్తుత పరిస్థితిని 1918లో ఫ్లూ మహమ్మారితో పోల్చాడు.
బయట కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ల్యాబ్ లో పరిశోధనల్ని ఒక రెండు వారాలపాటు పూర్తిగా నిలిపివేసి రెండు వారల తరువాత పరిస్థితులు చక్కబడితే అప్పుడు చూసుకుందాము అని చెప్పాడు. ల్యాబుల్లోని మా సరంజామా సర్ధేయడానికి రెండు రోజుల గడువు ఇచ్చాడు. (ఏవైనా ఎక్స్పరిమెంట్లు కొనసాగుతూఉంటే వాటిని పూర్తి చేయడానికి, లేదా, ఇంకా సమయం పడుతుందంటే వాటిని ఆపేయడానికి)
ప్రస్తుత పరిస్థితులు యుద్ధాన్ని తలపిస్తున్నాయని, పౌరులుగా యుద్ధ సమయంలో మనం ఎలా అయితే తలదాచుకుంటామో, ఇప్పుడు కూడా అలాగే దాచుకోవాల్సిన సమయం అని అన్నాడు. ఇండ్లలోనే ఉండి సోషల్ డిస్టెంసింగ్ పాటించాలని అన్నాడు.
ల్యాబ్ మీటింగ్స్ మాత్రం ఆన్ లైన్ లో క్రమం తప్పకుండా జరుగుతాయని, మమ్మల్ని అందరిని పెండింగ్ పేపర్లు ఉంటె ఫినిష్ చేయమని చెప్పాడు. ప్రతివారం జర్నల్ క్లబ్ మీటింగ్ నిర్వహిద్దామని, ఒక్కొక్కరుగా తమ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక రీసెర్చ్ పేపర్ ని ప్రవేశపెట్టాలని ఆయన అన్నాడు.
Also read: అమెరికాలో అమ్మ చేతి వంట: కరోనాపై తెలుగు ఎన్నారై మనోగతం
రెండు రోజుల్లో ల్యాబ్ ను పూర్తిగా మూసివేయనున్నట్టు చెప్పారు. నా ఎక్స్పరిమెంట్ ఏమో ల్యాబ్ లో ఉంది. మరికొంత సమయమా ఉంటే దాని టెస్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చేయి. కానీ ఇప్పుడు రీసెర్చ్ పేపర్ ని రాసేంత డేటా మాత్రం లేదు. మరోపక్క ల్యాబ్ మూసి వేస్తున్నారు. నా ఎక్స్పరిమెంటును కొన్ని రోజులపాటు అర్థాంతరంగా వాయిదా వేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు.
ఇక నా ఎక్సపెరిమెంటు వాయిదా తప్పదు అని తేలడంతో ల్యాబులో నేను వచ్చే వారం పరిశోధనలు చేయడానికి కలిపి పెట్టిన సాంపుల్స్ ని బయట పడేయడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ ని కలిసాను.
పరిశోధక విద్యార్ధి జీవితంలో ఒక పెద్ద జర్నల్ లో పేపర్ ప్రచురితమవడం చాలా గొప్ప విషయం. అందునా అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జర్నల్ అయితే, అది మరో లెవెల్ లో ఉంటుంది. నేను ల్యాబ్ లో కలిసిన ఫ్రెండ్ రీసెర్చ్ పేపర్ కూడా త్వరలో ప్రపంచ ప్రఖ్యాత నేచర్ జర్నల్ లో పబ్లిష్ అవనుంది.
ఆమె పేపర్ ఆ జర్నల్ లో పబ్లిష్ అవడానికి ఇంకా కేవలం ఒక రెండు ఎక్స్పరిమెంట్ ఫలితాలను రివ్యూ కమిటీ ఓకే చేస్తే సరిపోతుంది. కానీ ఈ తరుణంలో ఇలా ల్యాబ్ మూసేయడంతో ఆమె బాధ మాటలకు అందడం లేదు. అర్థరాత్రి పూత ల్యాబ్ కి వెళ్లినా ఆమె ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. ఉదయమంతా సాంపుల్స్ కలుపుతూ రాత్రి టెస్ట్ చేస్తూ పూర్తిగా అందులో నిమగ్నమయిపోయి ఉంటుంది. ఇప్పుడు తన పేపర్ పబ్లిష్ అయ్యే వేళా ఒక్క అడుగు ముందు ఇలా ల్యాబ్ ను మూసివేస్తామని నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు రవి అని నిట్టూర్చింది.
తనను చూసి నేను నా పరిశోధన చేయలేకపోతున్నాను అన్న బాధ పడకూడదని డిసైడ్ అయి నేను అప్పటికే చదవడం ప్రారంభించిన రోనన్ ఫారో రాసిన క్యాచ్ క్యాచ్ అండ్ కిల్ ను చదవడం మొదలుపెట్టాను. రూంలో నా బెడ్ మీద కూర్చొని సాయంత్రం కల్లా ఆ పుస్తకాన్ని పూర్తిచేశాను.
చేసేదేమి లేక నా బుక్ షెల్ఫ్ ముందున్న స్టూల్ మీద కూర్చొని పోయెట్రీ చదవాలా పోర్స్ చదవాలా అనే ఆలోచనలతో తలమునకలై లాస్ట్ డేస్ అఫ్ సోక్రటీస్ బుక్ చదువుదాం అని డిసైడ్ అయిపోయాను. ఆ బుక్ అందుకొని బెడ్ మీద పడుకుంటుండగా నా లూమియా(lumiere) కనిపించింది. లూమియా అంటే ఫ్రెంచ్ భాషలో వెలుగు అని అర్థం. నేను నా గిటార్ కి పెట్టుకున్న పేరు అదమూడు నాలుగు రోజుల్లో ఆ పుస్తకం చదవడం కూడా పూర్తయింది.
బయట సూర్యుడు వస్తే పార్క్ కి వెళ్లి కొద్దీ సేపు ఎక్సర్సైజ్ చేయడం, యు ట్యూబ్ వీడియోలు చూడడం, ఆన్ ల;ఇన్ లో ల్యాబ్ మీటింగ్స్ అటెండ్ కావడం, కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తో, బంధువులతో ఫోన్లు మాట్లాడడం, ఇది నా రోజువారీ దైనందన కార్యక్రమాలయిపోయాయి.
ఇక ఇలా ఒక ల్యాబ్ మీటింగ్ లో మాట్లాడుతుండగా మా బాస్ ఒక బాంబు పేల్చాడు. లాక్ డౌన్ మరో నాలుగు నుంచి ఆరు వారాలపాటు కొనసాగవచ్చని అన్నాడు. ఈ వార్త తెలియగానే చాలా బాధపడ్డాను. బయట పరిస్థితులు అదుపులో లేనందున, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, ఆసుపత్రుల మీద భారం తగ్గించడానికి లాక్ డౌన్ లో ఉండాల్సిందే అని మా బాస్ చెప్పాడు.
ఆ వార్త విన్న తరువాత ఒక్కసారిగా చీకట్లో కూరుకుపోయినట్టు అనిపించింది. బ్రతుకంతా అంధకారమే అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ మూడు నాలుగు రోజులపాటు వేరే పుస్తకం ఏది ఓపెన్ చేయలేకుండా నా గిటార్ వాయిస్తూ, నెట్ ఫ్లిక్స్ చూస్తూ కాలక్షేపం చేశాను.
నేను సంశయవాదినవ్వడం వల్ల సృష్టిలోని చిన్న చిన్న విషయాలను, ఆనందాలను పెద్దగా పట్టించుకోను. కానీ నేను యు ట్యూబ్ లో చూసిన ఒక వీడియో నన్ను ఒక్కసారిగా మార్చివేసింది.
కరోనా వైరస్ కి సంబంధించి ఒక వీడియో చూస్తుండగా అందులో వైరస్ వల్ల శరీరం పై కలిగే ప్రాభవం, దానికిచ్చే ట్రీట్మెంట్ గురించి చెబుతున్నారు. వైరస్ వల్ల లంగ్స్ లో ఒకలాంటి లిక్విడ్ చేరి, న్యుమోనియా లాంటి కండిషన్స్ వల్ల ఊపిరితిత్తులు వాచిపోయి, ఊపిరితీసుకోవడం కష్టంగా మారుతుంది.
దీనితో ఆక్సిజన్ అందక మనిషి రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. రోగ నిరోధక శక్తి వీక్ గా ఉండే ప్రజల్లో కిడ్నీలు, లివర్ ఇలా ఒకదానితరువాత ఒకటిగా పాడయిపోతాయి. అలా జరగకుండా ఉండడం కోసం వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తారు. ఇది కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ కాదు. ఒకదానితరువాత ఒకటి శరీరంలోని అవయవాలు పాడవకుండా కాపాడడం కోసం మాత్రమే.
ఈ వీడియో చూసినతరువాత నేను రూమ్ లో నుంచి బయటకు వచ్చి బలంగా శ్వాస తీసుకున్నాను. ఇంత ఆనందంగా ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇబ్బంది పడకుండా సొంతగా ఇలా ఊపిరి తీసుకోవడానికిన్ కూడా పెట్టిన పుట్టాలేమో అనిపించింది. చాలా చిన్న విషయంగా అనిపించే ఊపిరి తీసుకోవడం కూడా నేడు చాలా విలువైనదిగా కనబడుతుంది.
ఈ వరం కాకపోతే పై వచ్చే వారం ఈ భయంకర పరిస్థితుల నుంచి మాత్రం మనం బయటపడతాము. జీవితమంతా అంధకారం మాత్రం కాదు. చీకటి తరువాత వెలుగు ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇక ఈ లాక్ డౌన్ కాలమంతా ఇంట్లోనే ఉంది జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిద్దామని డిసైడ్ అయ్యాను.
మీరు కూడా ఈ లాక్ డౌన్ కాలంలో ఇండ్లలోనే ఉండడం అవసరం. అది కేవలం మీ ప్రాణాలకే కాదు, ఇతరుల జీవితాలకు కూడా మంచిది. మరణం కంటే ఒకింత ఇబ్బంది పడటం నయం కదా! స్టే హోమ్ స్టే సేఫ్
లాక్ డౌన్: గదిలో గిటార్ వాియస్తూ అమెరికాలోని హైదరాబాదీ pic.twitter.com/mRnSGhGmmq
— Asianet News Telugu (@asianet_telugu)